కేసీఆర్.. కుక్క చావు చస్తావ్ అన్న రేవంత్ వ్యాఖ్యలను సీరియస్ కౌంటర్ ఇచ్చారు.

సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్.. కుక్క చావు చస్తావ్ అన్న రేవంత్ వ్యాఖ్యలను సీరియస్ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎక్స్‌లో ట్వీట్ చేస్తూ 'నువ్వు స్లిప్పర్లు వేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు పనికిమాలిన పోరనిలా తిరుగుతున్నప్పుడే ...ఆయన తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం తన పదవికి తృణప్రాయంగా రాజీనామా చేశాడు! నువ్వు పార్టీ టిక్కెట్ కోసం లాబీయింగ్‌లో బిజీగా ఉన్నప్పుడే...ఆయన తెలంగాణ స్వరాష్ట్రం కావాలని స్వప్నించాడు. ఎంతో పట్టుదలతో పోరాటం చేసి తెలంగాణ సాధించాడు. తెలంగాణ గొంతుకలను అణచివేయడానికి నువ్వు తుపాకీ పట్టుకున్నప్పుడు... ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను పణంగా పెట్టాడు. తెలంగాణ రాష్ట్రాన్ని అస్థిరపరచడానికి నీ చేతులు " డబ్బుల బ్యాగులు" పట్టుకున్నప్పుడు...సాధించిన తెలంగాణను దేశంలోనే చరిత్ర సృష్టించే విధంగా తయారు చేసేందుకు ఆయన తన మేధస్సుకు పదును పెట్టారు. సాధించిన తెలంగాణను సగర్వంగా తలెత్తుకొనేలా చేసిన ఆయన ఈ రాష్ట్రానికి గర్వకారణం. నీలాంటి జోకర్.. ఆయన మీద పిచ్చి ప్రచారాలు చేస్తూ, దుర్భాషలాడి చరిత్ర నుంచి ఆయన పేరు చెరిపివేయవచ్చని అనుకోవటం మూర్ఖత్వం. తెలంగాణ ఉన్నంత కాలం కేసీఆర్‌ ఉంటారు. ఆ పేరును ఎవరు చెరిపేయలేరు' అంటూ కేటీఆర్‌ ట్వీట్ చేశారు.

ehatv

ehatv

Next Story