బతుకమ్మ(Bathukamma) పండగ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాట్లు సరిగా చేయాలేదని కేటీఆర్‌(KTR) విమర్శించారు.

బతుకమ్మ(Bathukamma) పండగ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాట్లు సరిగా చేయాలేదని కేటీఆర్‌(KTR) విమర్శించారు. రేవంత్‌ సర్కార్‌ను విమర్శిస్తూ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. 'బతుకమ్మ అంటే గిట్టదా..పట్టదా ఈ ముఖ్యమంత్రికి, ఆడబిడ్డల వేడుకకు ఏర్పాట్లు చేయడానికి మనసురాట్లేదా ? పండుగపూట కూడా పల్లెలను పరిశుభ్రంగా వుంచలేరా ? చెత్తా చెదారం మధ్య మురికి కంపులో మన అక్కా చెల్లెళ్లు బతుకమ్మ ఆడుకోవాల్నా? బ్లీచింగ్ పౌడర్ కొనడానికి..చెరువు కట్టమీద లైట్లు పెట్టడానికి పైసల్లేని పరిస్థితులు దాపురించాయి పంచాయతీల్లో! రాష్ట్ర పండుగను నిర్వహించుకునేందుకు నిధుల్లేని దౌర్భాగ్యం ఎందుకొచ్చింది..? తెలంగాణ అస్తిత్వ సంబురంపై ఎందుకింత నిర్లక్ష్యం..? ప్రకృతిని పూజించే విశిష్ట పండుగను.. స్వచ్ఛమైన పరిసరాల్లో జరుపుకునే భాగ్యం కూడా లేదా మహిళలకు? బతుకమ్మ చీరెలను రద్దు చేసారు..ఇప్పుడు బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా చేసుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారా..' అంటూ కేటీఆర్ ట్వీట్‌ చేశారు.

Eha Tv

Eha Tv

Next Story