KA Paul : ఫిరాయింపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌పై హైకోర్టుకు కేఏ పాల్

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శుక్రవారం తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు

Update: 2024-08-31 02:56 GMT

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శుక్రవారం తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ పిటీష‌న్‌పై విచారణ సందర్భంగా.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ జె శ్రీనివాసరావు నేతృత్వంలోని ధర్మాసనం ఇప్పటికే ఇలాంటి కేసులు విచారించబడి.. తీర్పు పెండింగ్‌లో ఉన్నందున కొత్త పిటీష‌న్ ఆవశ్యకత ఏంట‌ని ప్రశ్నించింది. రాజకీయ పార్టీలు సమర్పించిన వివ‌రాల‌తో పోలిస్తే తన పిల్‌ విభిన్న అంశాలను సమర్పించిందని పాల్ త‌ర‌పు న్యాయ‌వాది వాదించారు. పిటిష‌న్‌కు సంబంధించి అఫిడవిట్‌ను సమర్పించాల్సిందిగా కేఏ పాల్ త‌రుపు న్యాయ‌వాదిని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి షెడ్యూల్ చేసింది. 

Tags:    

Similar News