BRS : బీఆర్ఎస్‌కు కోలుకోలేని షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్సీలు

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న అర్థరాత్రి ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు

By :  Eha Tv
Update: 2024-07-05 04:20 GMT

బీఆర్ఎస్ పార్టీకి మ‌రో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో నిన్న అర్థరాత్రి ఆరుగురు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నుంచి ఇప్ప‌టివ‌ర‌కూ ఆరుగురు ఎమ్మెల్యేలతో సహా పలువురు నేతలు పార్టీని వీడడంతో.. బీఆర్ఎస్ ఫిరాయింపులతో బాధపడుతూనే ఉంది. తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు పార్టీని వీడ‌టంతో బీఆర్ఎస్‌కు కోలుకోలేని షాక్ త‌గిలిన‌ట్టైంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో ఎమ్మెల్సీలు దండె విఠల్, భానుప్రసాద్ రావు, ఎం.ఎస్. ప్రభాకర్, బొగ్గారపు దయానంద్, ఎగ్గే మల్లేశం, బస్వరాజు సారయ్యలు కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు.

తెలంగాణ శాసన మండలి వెబ్‌సైట్ ప్రకారం.. ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో 25 మంది, కాంగ్రెస్‌కు నలుగురు ఎమెల్సీలు ఉన్నారు. నాలుగు నామినేటెడ్ ఎమ్మెల్సీలు, AIMIM నుండి ఇద్దరు సభ్యులు, BJP, PRTU నుండి ఒక్కొక్కరు.. ఒక స్వతంత్ర MLC ఉండగా.. 40 మంది సభ్యుల సభలో ప్ర‌స్తుతం రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. తాజా ఫిరాయింపులతో శాసనమండలిలో కాంగ్రెస్ బలం 10కి చేరుకోనుంది.

Tags:    

Similar News