Rain Alert : రేప‌టి నుంచి నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు

జూలై 18 నుండి నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరిక జారీ చేసింది

By :  Eha Tv
Update: 2024-07-17 04:01 GMT

జూలై 18 నుండి నాలుగు రోజుల పాటు అతి భారీ వర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ భారత వాతావరణ విభాగం (IMD) హెచ్చరిక జారీ చేసింది. ఈ మేర‌కు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. హైదరాబాద్‌లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. జూలై 20 వరకు నగరంలో ఇవే వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది.

తెలంగాణ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీజీడీపీఎస్) గణాంకాల ప్రకారం.. నిన్న కుమురం భీమ్ జిల్లాలో అత్యధికంగా 137.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో అత్యధికంగా ఖైరతాబాద్‌లో 3.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మెదక్‌ జిల్లాలో 26.4 డిగ్రీల సెల్సియస్‌, హైదరాబాద్‌, తిరుమలగిరిలో 29.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గింది.

రానున్న వర్షాకాల సవాళ్లను పరిష్కరించేందుకు హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎలక్ట్రికల్‌, వాటర్‌ వర్క్స్‌, ఎంటమాలజీ, టౌన్‌ ప్లానింగ్‌, శానిటేషన్‌ విభాగాలతోపాటు వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:    

Similar News