HYDRAA : చెరువులలో నిర్మించిన విద్యా సంస్థలపై హైడ్రా సంచలన‌ నిర్ణయం

చెరువులలో నిర్మించిన విద్యా సంస్థలపై హైడ్రా సంచలన‌ నిర్ణయం తీసుకుంది. ముందస్తుగా నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి విద్యాసంస్థల్ని తరలించేందుకు అవకాశం ఇస్తామ‌ని పేర్కొంది

Update: 2024-08-28 03:47 GMT

చెరువులలో నిర్మించిన విద్యా సంస్థలపై హైడ్రా సంచలన‌ నిర్ణయం తీసుకుంది. ముందస్తుగా నోటీసులు ఇచ్చి అక్కడి నుంచి విద్యాసంస్థల్ని తరలించేందుకు అవకాశం ఇస్తామ‌ని పేర్కొంది. విద్యార్థుల అకాడమిక్ ఇయర్ నష్టపోకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటామ‌ని వెల్ల‌డించింది. ఓవైసీ, మల్లారెడ్డి సంస్థలకు ముందస్తు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామ‌ని పేర్కొంది. చెరువుల అక్ర‌మ‌ణ‌, అక్ర‌మ నిర్మాణాల‌కు సంబంధించి ఫిర్యాదు చేసేందుకు వ‌చ్చిన‌ బీజేపీ కార్పోరేట‌ర్ల‌తో ఆయ‌న‌ మాట్లాడుతూ.. హైడ్రా రాజ‌కీయ చ‌ద‌రంగంలో పావు కాదల్చుకోలేద‌న్నారు. ధ‌ర్మ‌స‌త్ర‌మైనా ఎఫ్‌టీఎల్‌లో ఉంటే కూల్చేస్తామ‌న్నారు.

చాంద్రాయణగుట్ట సలకం చెరువులోని ఒవైసీకి చెందిన ఫాతిమా కాలేజీపై హైడ్రా నిర్ణయం తీసుకుంది. విద్యాసంస్థల్లో అక్రమ కట్టడాలు తొలగించేందుకు సమయం ఇస్తామ‌ని పేర్కొంది. విద్యా సంస్థలు కాబట్టి అకడమిక్ ఇయర్ మధ్యలో చర్యలు తీసుకుంటే విద్యార్థులకు నష్టం జ‌రుగుతుంద‌ని హైడ్రా భావిస్తోంది. విద్యార్థులు రోడ్డున పడకూడదని మాత్రమే ఆలోచిస్తున్నామ‌ని హైడ్రా వెల్ల‌డించింది. వాళ్లకు వాళ్లుగా తొలగించకపోతే హైడ్రా చర్యలు తీసుకుంటుందని.. ఒవైసీ అయినా, మల్లారెడ్డి .. పల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి ఐనా అందరికీ ఒకటే రూల్ అని హైడ్రా కమిషనర్ రంగనాథ్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News