అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యు(V narsimhacharyulu) లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు(High court) ఈ రోజు తీర్పు వెలువరించనుంది.

పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై(BRS MLA) అనర్హత వేటు(Disqualification) వేయాలంటూ వేసిన పిటిషన్లపై సింగిల్‌ జడ్జి ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యు(V narsimhacharyulu) లు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు(High court) ఈ రోజు తీర్పు వెలువరించనుంది. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్లను అనుమతిస్తూ సింగిల్‌ జడ్జి సెప్టెంబర్‌ 9వ తేదీన ఇచ్చిన తీర్పును కొట్టేయాలని దాఖలైన రెండు పిటిషన్లపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ఈ నెల 12న వాదనలు ముగించింది.ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ జే శ్రీనివాసరావుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించనుంది.సింగిల్‌జడ్జి తీర్పును రద్దు చేయాలని అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదించారు. దీనిపై బీఆర్‌ఎస్‌ తరఫు సీనియర్‌ న్యాయవాదులు మోహన్‌రావు, జే రామచందర్‌రావు ప్రతివాదనలు చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో సింగిల్‌జడ్జి జోక్యం చేసుకోలేదని తెలిపారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసేందుకు వెళితే స్పీకర్‌కు పిటిషన్‌ తీసుకోలేదని, అందువల్లే హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు.

Updated On 22 Nov 2024 3:30 AM GMT
Eha Tv

Eha Tv

Next Story