పిల్లలే లేక తల్లడిల్లుతున్న దంపతులు ఎందరో ఉన్నారు. కనీసం వారికి ఇచ్చినా సంతోషంగా సాదుకుంటారు.

పిల్లలే లేక తల్లడిల్లుతున్న దంపతులు ఎందరో ఉన్నారు. కనీసం వారికి ఇచ్చినా సంతోషంగా సాదుకుంటారు. ఆడ, మగ అనే తేడా లేకుండా ఎవరైనా సరే అంటున్న ఈ తరుణంలో ఆడ పిల్ల పుట్టిందని శిశువును వదిలివెళ్లిపోవడం.. ఆ శిశువు 48 గంటలుగా ఆస్పత్రిలోనే ఉండడం స్థానికులను కలిచివేసింది. నవ మాసాలు మోసి, ఆడ పిల్లకు జన్మనిచ్చిన ఆ తల్లికి ఎలా వదిలేయాలనిపించిందోనని ప్రశ్నిస్తున్నారు. మూడు రోజులు కింద జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిర్మల్ జిల్లా(Nirmal District) భైంసా మండలం హాస్గుల్ గ్రామానికి చెందిన నాగమణి అనే వివాహిత ఈనెల 4వ తేదిన పురుడు పోసుకునేందుకు జిల్లా కేంద్రంలోని కస్తూర్బా గాంధీ మెటర్నిటీ ఆసుపత్రిలో చేరి మూడవ సంతానంగా ఆడశిశువు జన్మించడంతో మనస్తాపం చెంది 4గంటల నుండి ఆడ శిశువును ఆసుపత్రిలో వదిలి వెళ్ళిపోయింది ఓ తల్లి. ఆస్పత్రి వర్గాలను వివరణ కోరినా స్పందన కరువైంది. దీంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన తండ్రి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు.

ehatv

ehatv

Next Story