☰
✕
ఓ వ్యక్తి అత్యాశ పడ్డాడు. అనతికాలంలో అపరిమితంగా సంపాదించాలనుకున్నాడు.
x
ఓ వ్యక్తి అత్యాశ పడ్డాడు. అనతికాలంలో అపరిమితంగా సంపాదించాలనుకున్నాడు. ఇందుకు గంజాయిసాగును(Cannabis) ఎంచుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు(Police) విచారించగా విషయం బయటపడింది. దీంతో అరెస్ట్ చేసి(Arrest) కటకటాల్లోకి నెట్టారు. దీంతో కోర్టు(Court) ఐదేళ్ల జైలు శిక్ష కూడా విధించింది. సంగారెడ్డి జిల్లా(Sangareddy) పెద్దగ్రామంలో వెంకటేశ్వర్లు అనే వ్యక్తి గంజాయి మొక్కలు సాగు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి విచారించగా 36 గంజాయి మొక్కలు పెంచుతున్నట్లు తేలింది. కేసు నమోదు చేసిన పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. విచారించిన కోర్టు తీర్పు వెలువరించింది. నిందితుడు వెంకటేశ్వర్లుకు ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.25 వేల నగదు ఇస్తూ తీర్పునిచ్చారు.
Eha Tv
Next Story