CM Revanth Reddy : ఓటుకు నోటు కేసు.. విచారణకు హాజరు కావాలని రేవంత్ రెడ్డికి కోర్టు ఆదేశం

నాంపల్లి కోర్టులో మంగ‌ళ‌వారం ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే వచ్చే నెల 16న సీఎం రేవంత్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.

Update: 2024-09-24 13:00 GMT

నాంపల్లి కోర్టులో మంగ‌ళ‌వారం ఓటుకు నోటు ఈడీ కేసు విచారణ జ‌రిగింది. ఈ క్ర‌మంలోనే వచ్చే నెల 16న సీఎం రేవంత్ రెడ్డిని విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. నేటి విచారణకు మత్తయ్య మినహా మిగతా నిందితులు గైర్హాజరు అయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహా, వేం కృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ గైర్హాజరు అయ్యారు. నిందితుల గైర్హాజరుపై నాంపల్లి కోర్టు అసహనం వ్యక్తం చేస్తూనే.. నేటి విచారణకు మినహాయింపు ఇవ్వాలన్న నిందితుల అభ్యర్థనను అంగీకరించింది. అక్టోబరు 16న విచారణకు హాజరు కావాలని రేవంత్ సహా నిందితులందరికీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

Tags:    

Similar News