Mahabubnagar District : జిల్లాలో రూ. 396 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన

మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

By :  Eha Tv
Update: 2024-07-09 11:56 GMT

మహబూబ్ నగర్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగా.. రూ.353.66 కోట్లతో చేప‌ట్ట‌నున్న‌ వివిధ అభివృద్ధి పనులకు సీఎం మంగ‌ళ‌వారం శంకుస్థాపన చేశారు. పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో చేప‌ట్ట‌నున్న‌ వివిధ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభించారు.

ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు. అలాగే.. మహబూబ్ నగర్ రూరల్ లో రూ.3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి.. గండీడ్ లో రూ.6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

పాలమూరు యూనివర్సిటీలో రూ.13.44 కోట్లతో ఎస్టీపీ, అకాడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు, మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులకు.. మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అంత‌కుముందు మహబూబ్ నగర్ కలెక్టరేట్‌లో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 

Tags:    

Similar News