తాజాగా పాలకుర్తి నియోజకవర్గ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.
గత కొన్ని రోజులుగా స్తబ్దుగా ఉన్న బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ యాక్టివ్ అయినట్లు కనిపిస్తోంది. దసరా ముందు పలు నియోజకవర్గ కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించిన కేసీఆర్.. కార్యకర్తల తాకిడి ఎక్కువ కావడంతో కొన్ని రోజులపాటు ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేశారు. తాజాగా పాలకుర్తి నియోజకవర్గ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆధ్వర్యంలో నియోజకవర్గ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీశారు. పార్టీ నేతలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అందరూ కష్టపడి పనిచేయాలి. కొత్త ప్రభుత్వం వచ్చి 11 నెలలు అయింది.. ప్రజలు ఏం కోల్పోయారో గ్రహించారు. మళ్లీ వంద శాతం మనదే ప్రభుత్వమని కేసీఆర్ అన్నారు. అంతేకాకుండా బీఆర్‌ఎస్‌లో కొన్ని చేరికలు కూడా జరిగాయి. కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరిన సినీ నిర్మాత శ్రీనివాస్, సినీ నటుడు రవితేజ. పార్టీ కండువా కప్పి శ్రీనివాస్, రవితేజకు కేసీఆర్ ఆహ్వానించారు. జనవరి నుంచి ప్రత్యక్ష కార్యాచరణలోకి దిగుతారని వస్తున్న వార్తలతో కేసీఆర్