BRS Party : రాజీవ్ గాంధీ విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా రేపు తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాల‌కు పాలాభిషేకాలు..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం సచివాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు

Update: 2024-09-16 14:35 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 16వ తేదీ సోమవారం సచివాలయంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. మొద‌టి నుంచి కాంగ్రెస్ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తున్న‌ ప్రధాన ప్రతిపక్ష పార్టీ భారత రాష్ట్ర సమితి.. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలభిషేకాలు చేయాల్సిందిగా శ్రేణుల‌కు పిలుపునిచ్చింది.

తెలంగాణ తల్లి కోసం కేటాయించిన స్థానంలో కేవలం రాజకీయ దురుద్దేశంతో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టి..తెలంగాణ తల్లిని అవమాన పరిచిన సీఎం రేవంత్ రెడ్డి వైఖరిని ప్రతి ఒక్కరు ఖండించాలని సూచించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసిన కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలు బుద్ధి చెబుతార‌ని అన్నారు. తెలంగాణ అస్తిత్వంతో పెట్టుకున్నోళ్లెవరూ రాజకీయాల్లో బతికి బట్టకట్టలేరన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలని హితువు ప‌లికారు.  

Tags:    

Similar News