ప్రేమ పేరుతో పెళ్ళైన వారం రోజులకే నవవధువును బీజేపీ నాయకుడు లేపుకెళ్లాడు.

ప్రేమ పేరుతో పెళ్ళైన వారం రోజులకే నవవధువును బీజేపీ నాయకుడు లేపుకెళ్లాడు. దీంతో బీజేపీ నాయకుడి ఫోటోకు చెప్పుల దండ వేసిన స్థానికులు నిరసన తెలిపారు. హైదరాబాద్‌(Hyderabad)లోని లంగర్‌హౌస్‌(langerhouse)కు చెందిన బీజేపీ నాయకుడు గురజాల అరవింద్ కుమార్‌(Aravind Kumar)కు అదే ప్రాంతానికి చెందిన నవవధువు మౌనికతో పరిచయం ఉండేది. ఆ పరిచయాన్ని ప్రేమలా నమ్మించి 7 రోజుల కింద పెళ్ళైన మౌనిక(Mounika)ను అరవింద్ కుమార్ ఎత్తుకెళ్లాడు. అరవింద్ కుమార్‌కు ఇంతకు ముందే పెళ్ళయ్యి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. గత ఎనిమిది రోజు క్రితం అత్తాపూర్ కు చెందిన శివరామకృష్ణతో జ్యోతి వివాహం అయింది. వరుడితో పెళ్లి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల బలవంతంతో తల వంచి‌ తాళి కట్టించుకున్న నవ వధువు.. ప్రేమించిన ప్రియుడిని వదిలేసి ఉండలేకపోయింది. వన్ ఫైన్ మార్నింగ్ ప్రియుడు అరవింద్‌తో కలిసి లేచిపోయింది. భార్య పిల్లలను వదిలేసి, కొత్తగా వివాహమైన అమ్మాయిని తీసుకొని వెళ్ళడం ఏంటని ఆగ్రహంతో స్థానికులు అరవింద్ కుమార్ ఫోటోకు చెప్పుల దండ వేశారు.

ehatv

ehatv

Next Story