తెలంగాణ పేదలకు, మధ్యతరగతికి కూల్చివేతల భయం పట్టుకుంది. ఆ మాటకొస్తే ఎగువ మధ్య తరగతి కూడా బిక్కుబిక్కుమంటూ ఉంది.

తెలంగాణ పేదలకు, మధ్యతరగతికి కూల్చివేతల భయం పట్టుకుంది. ఆ మాటకొస్తే ఎగువ మధ్య తరగతి కూడా బిక్కుబిక్కుమంటూ ఉంది. తమ నివాసాలు ఎఫ్‌టిఎల్‌(FTL) పరిధిలో ఉన్నాయో, బఫర్‌జోన్‌లో ఉన్నాయో తెలియక తల్లడిల్లిపోతున్నారు. తెలంగాణ ప్రజలకు హైడ్రా ఫోబియా పట్టుకుంది. ఈ క్రమంలో ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్‌ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) విలువైన, సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని(CM Revanth Reddy) ప్రశ్నలతో నిలదీశారు. రాష్ట్ర సెక్రటేరియట్‌(Secretariat)తో జాతిపిత మహాత్మాగాంధీ(Mahatma Gandhi) స్మారకచిహ్నం బాపు ఘాట్‌(Bapu Ghat), ఇంకా మరెన్నో ప్రముఖ కట్టడాలు ఎఫ్‌టిఎల్‌ పరిధిలోనే ఉన్నాయని, రాస్త్ర పరిపాలన విభాగమే ఎఫ్‌టిఎల్‌లో ఉన్నప్పుడు లేని ఇబ్బంది పేదల నివాసాలు ఉంటే తప్పేమిటని అసదుద్దీన్‌ ప్రశ్నించారు. అభివృద్ధికి తమ సహకారం ఎప్పటికీ ఉంటుందని, అయితే అభివృద్ధి పేరుతో విధ్వంసం చేసే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. అసదుద్దీన్‌ లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా! మూసీ సుందరీకరణ పేరుతో పక్కనే ఉన్న ఇండ్లను కూల్చివేస్తున్నట్టుగానే మూసీ మధ్యలో ఉన్న ఇమ్లీబన్‌ బస్ట్‌స్టేషన్(Imliban Bus Station), మెట్రో రైల్వే స్టేషన్‌(Metro Station)లను కూల్చేస్తారా? గ్రేటర్‌ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కూలగొడతారా? అన్నది సామాన్యుల నుంచి వస్తున్న ప్రశ్నలు.

ehatv

ehatv

Next Story