మరికొద్ది గంటల్లో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 థియేటర్లలోకి రాబోతున్నది.

మరికొద్ది గంటల్లో అల్లు అర్జున్‌ నటించిన పుష్ప 2 థియేటర్లలోకి రాబోతున్నది. తెలుగు రాష్ట్రాలలోనే కాదు, దేశమంతటా పుష్ప ఫీవర్‌ కనిపిస్తోంది. టికెట్ల రేట్లు కూడా కావాల్సినంతగా పెంచుకున్నారు. ఓ వర్గం ఆల్‌రెడీ పుష్ప 2 సినిమాపై నెగటివ్‌ క్యాంపైన్‌ మొదలుపెట్టింది. ఇది ఇలా ఉంటే ఆర్మూర్‌ బీజేపీ ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి (MLA Paidi Rakesh Reddy)ఈ సినిమాపై షాకింగ్‌ కామెంట్లు చేశారు. పుష్ప సినిమాలో చూపించిందంతా అబద్ధమని, ఎర్రచందనం లక్ష రూపాయలు ఉంటే కోటి రూపాయలుగా చూపించారని రాకేశ్‌ రెడ్డి చెబుతూ, దీనివల్ల యువత చాలా చెట్లు నరికేశారని ఆరోపించారు. ఇప్పుడు పుష్ప 2 సినిమాకు ఇంకెన్ని చెట్లు నరికేస్తారోనని సందేహపడ్డారు. పుష్ప సినిమా వల్ల యువత చెడిపోతున్నదని, అల్లు అర్జున్‌, సుకుమార్‌ను అరెస్ట్‌ చేసి జైల్లో వేయాలని ఆయన అన్నారు. ఎమ్మెల్యే రాకేశ్‌ రెడ్డి చేసిన ఈ కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎమ్మెల్యే కామెంట్లపై నెగిటివ్‌ కామెంట్సే ఎక్కువగా వస్తున్నాయి. బన్నీ ఫ్యాన్స్‌ రాకేశ్‌రెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతున్నారు.

ehatv

ehatv

Next Story