IND vs ENG Semi Final : మన మ్యాచ్‌కు రిజర్వ్ డే ఎందుకు లేదు?
టీ-20 ప్రపంచకప్ ప్రీ క్లయిమాక్స్ స్టేజ్‌కు వచ్చింది. సెమీస్ పోరుకు నాలుగు దేశాలు సిద్ధమయ్యాయి.
టీ-20 ప్రపంచకప్(T20 World Cup) ప్రీ క్లయిమాక్స్ స్టేజ్‌కు వచ్చింది. సెమీస్ పోరుకు నాలుగు దేశాలు సిద్ధమయ్యాయి. అఫ్గనిస్తాన్-దక్షిణాఫ్రికా(Afghanistan-South Africa) మధ్య జరిగే తొలి సెమీస్ రేపు అంటే 27వ తేదీన ట్రినిడాడ్(Trinidad)లో జరగుతుంది. భారత కాలమాన ప్రకారం ఉదయం ఆరు గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. ఈ మ్యాచ్‌కు మర్నాడును రిజర్వ్ డేగా ఉంచారు. వర్షం కారణంగా షెడ్యూల్ సమయంలో మ్యాచ్ పూర్తి కాకపోతే అదనంగా మరో 60 నిమిషాలు కేటాయింఆరు. రిజర్వ్ డే రోజు 190 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్‌ను కేటాయించారు. అయితే ఒక్కసారి టాస్ వేసి టీమ్‌లో ఫైనల్ లెవన్ ప్లేయర్ల పేర్లు ఇచ్చిపుచ్చుకున్నాక వాటిల్లో మార్పులు చేయడానికి కుదరదు. రిజర్వ్ డే వాటికి కొనసాగింపుగానే ఉంటుంది. మళ్లీ టాస్ వేయరు. నిజానికి షెడ్యూల్ రోజునే మ్యాచ్ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అవసరమనుకుంటే ఓవర్లను కుదించి అయినా మ్యాచ్‌ను కంప్లీట్ చేస్తారు. అయితే వర్షం కారణంగా అది కూడా సాధ్యం కాకపోతే మాత్రం రిజర్వ్‌డేలో ఆడతారు. రిజర్వ్ డేలో కుదించిన ఓవర్ల ప్రకారం ఆడతారా? లేక పూర్తిగా 20 ఓవర్లు ఆడతారా? అన్నది అప్పటి కండిషన్లను బట్టి నిర్ణయిస్తారు. షెడ్యూల్ రోజునే ఓవర్ల కుదింపు నిర్ణయం జరిగిన తర్వాత ఒక్క బాల్ కూడా వేయకుండా వర్షం పడి మ్యాచ్ మరుసటి రోజుకు వాయిదా పడితే మాత్రం కుదించిన ఓవర్లు అమలుకావు. 20 ఓవర్లు పూర్తయ్యేవరకు ఆడాల్సిందే. అదే ఒక్క బాల్ ఆడినా మరుసటి రోజు కుదించిన ఓవర్లకే ఆడాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొదటి ఇన్నింగ్స్‌లో టీమ్ పది ఓవర్లు ఆడిన తర్వాత వర్షం పడి మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించానుకుందాం. ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత తిరిగి వాన మొదలయ్యి ఆట సాధ్యం కాలేక రిజర్వ్ డేకు వెళ్లిందనుకోండి. అప్పుడు మ్యాచ్ 20 ఓవర్ల వరకు ఆడాల్సి ఉంటుంది. ఆ రోజున కూడా వర్షం పడితే తాజాగా మళ్లీ ఓవర్ల కుదింపు నిర్ణయం తీసుకుంటారు. షెడ్యూల్ రోజున మ్యాచ్ మొదలయ్యి పది ఓవర్ల తర్వాత వర్షం కురిసి మ్యాచ్‌ను 15 ఓవర్లకు కుదించారనుకుందాం! తర్వాత ఓ ఓవర్ ఆడిన తర్వాత వర్షం పడి మ్యాచ్ రిజర్వ్ డే వరకు వెళ్లిందనుకుందాం! అప్పుడు కుదించిన 15 ఓవర్లకు ఆడాలి. మళ్లీ వర్షం పడితే అంపైర్లు చర్చించుకుని మ్యాచ్‌ను మరింత కుదించవచ్చు. ఆ రోజున 190 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్ ఉంటుంది. సెమీస్‌లో రిజల్ట్స్ తేలాలంటే రెండూ టీమ్‌లు కనీసం పది ఓవర్లు ఆడగలగాలి. అసలు వర్షం కారణంగా మ్యాచ్ జరగకపోతే అధిక ర్యాంకు ఉన్న టీమ్ ఫైనల్స్‌కు వెళుతుంది. ఒకవేళ ఇదే జరిగిదే సౌతాఫ్రికా ఫైనల్‌కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అదే గ్రూప్ 1లో ఇండియాకు ఛాన్సుంది. వర్షం కారణంగా ఫైనల్స్ ఆట సాధ్యం కాకపోతే సంయుక్త విజేతలుగా ప్రకటిస్తారు. ఇక రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ఇండియా-ఇంగ్లాండ్ మధ్య గయానాలో జరుగుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమాన ప్రకారం గురువారం రాత్రం 8 గంటలకు మొదలవుతుంది. ఈ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. కానీ ఒకే రోజు ఏకంగా 250 నిమిషాల ఎక్స్‌ట్రా టైమ్ కేటాయించారు. దీనికి రిజర్వ్ డే ఎందుకు లేదో తెలియదు. ఇండియా కనుక సెమీస్‌కు చేరితే సూపర్-8 స్టాండింగ్స్‌తో సంబంధం లేకుండా టీమిండియా గయానలో ఆడుతుందని ఎప్పుడో నిర్ణయించేవారు. ఎందుకంటే డేలో మ్యాచ్ జరిగితే చూసేందుకు ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో వస్తారు. గయానాలో భారత సంతతి ప్రజలు ఎక్కువన్న సంగతి తెలిసిందే! ఇండియా-ఇంగ్లాండ్ మ్యాచ్‌కు రిజర్వ్ డే లేకపోవడానికి కారణం టైమే! మొదటి సెమీస్ స్థానిక కాలమాన ప్రకారం జూన్ 26వ తేదీ రాత్రి 8.30 గంటలకు మొదలవుతుంది. భారత కాలమాన ప్రకారం జూన్ 27వ తేదీ ఉదయం ఆరు గంటలన్న మాట! రెండో సెమీస్ స్థానిక కాలమాన ప్రకారం జూన్ 27వ తేదీ ఉదయం 10.30 గంటలకు మొదలవుతుంది, మనకు రాత్రి 8 గంటలు. ఫైనల్ మ్యాచ్ జూన్ 29వ తేదీ ఉదయం 10.30 గంటలకు మొదలవుతుంది. ఒకవేళ రెండో సెమీస్‌కు రిజర్వ్ డే కేటాయిస్తే ఫైనల్స్ ఆడేందుకు అందులోని విన్నర్‌కు 24 గంటల టైమ్ కూడా ఉండదు. అందుకే రెండో సెమీస్‌కు రిజర్వ్ డే లేదన్నమాట!