Viral Video : ఇంత పిచ్చిగా అభిమానిస్తారా.? కోహ్లీని చూడాల‌ని..

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే విరాట్ అంటే పిచ్చి ఉన్న అభిమానులు కూడా ఉన్నారు.

Update: 2024-09-27 14:45 GMT

భారత స్టార్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే విరాట్ అంటే పిచ్చి ఉన్న అభిమానులు కూడా ఉన్నారు. రెండో టెస్టు మ్యాచ్ వేళ‌ అలాంటి పిచ్చి అభిమానం కనిపించింది. విరాట్ కోహ్లీని చూసేందుకు ఓ 15 ఏళ్ల యువ‌ అభిమాని 58 కిలోమీటర్లు సైకిల్‌పై కాన్పూర్‌కు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు.

15 ఏళ్ల విరాట్ కోహ్లీ అభిమాని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. ఈ అభిమాని తన అభిమాన స్టార్ కోహ్లీని చూసేందుకు సైకిల్‌పై 58 కిలోమీటర్లు ప్రయాణించి కాన్పూర్ చేరుకున్నాడు. ఈ యువకుడు గ్రీన్ పార్క్ వద్ద కోహ్లీని చూసేందుకు సైకిల్‌పై ఉన్నావ్ నుంచి కాన్పూర్ చేరుకున్నాడు.

వైరల్ వీడియోలో యువకుడు తన పేరు కార్తికేయ అని వెల్లడించాడు. అతడు సెప్టెంబర్ 27 ఉదయం 4:00 గంటలకు తన ప్రయాణాన్ని ప్రారంభించి.. శుక్రవారం ఉదయం 11:00 గంటలకు గ్రీన్ పార్క్ స్టేడియంకు ఎలా చేరుకున్నాడో వివరించాడు. తల్లిదండ్రులు రాకుండా అడ్డుకున్నారా అని అడిగితే.. ఇంట్లో అందరికీ ఈ విషయం తెలిసి సైకిల్‌పై వెళ్లేందుకు అనుమతి ఇచ్చార‌ని వెల్ల‌డించాడు. బాలుడు 10వ తరగతి చదువుతున్నాడు.

అయితే కోహ్లీ బ్యాటింగ్ చూడాలన్న కార్తికేయ కోరిక తొలిరోజు నెరవేరలేదు. ఎందుకంటే భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్ర‌స్తుతం బంగ్లా 3 వికెట్లు కోల్పోయి 107 ప‌రుగులు చేసింది. 

Tags:    

Similar News