Vinesh Phogat : వినేష్ ప‌త‌కంపై నిర్ణయం అప్పుడే..

పారిస్ ఒలింపిక్స్ 2024లో బలమైన ప్రదర్శనతో పాటు ఒకే రోజులో 3 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్న వినేష్ ఫోగట్ పతకం కోసం సుదీర్ఘ పోరాటం చేయాల్సి వ‌చ్చేలా ఉంది

Update: 2024-08-14 03:53 GMT

పారిస్ ఒలింపిక్స్ 2024లో బలమైన ప్రదర్శనతో పాటు ఒకే రోజులో 3 మ్యాచ్‌లు గెలిచి ఫైనల్స్‌కు చేరుకున్న వినేష్ ఫోగట్ పతకం కోసం సుదీర్ఘ పోరాటం చేయాల్సి వ‌చ్చేలా ఉంది. ఒకానొక సమయంలో వినేష్‌కి రజత పతకం ఖాయమైనప్పటికీ.. 100 గ్రాముల అధిక బరువు కారణంగా అనర్హత వేటుపడటంతో ఆమె గోల్డ్ మెడల్ మ్యాచ్‌లో పాల్గొనలేకపోయింది.

వినేష్ పారిస్ ఒలింపిక్స్‌లో 50 కిలోల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌లో పాల్గొంది. ఫైనల్‌కు ముందు అనర్హత వేటు పడిన వినేష్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)లో కేసు వేసింది. గోల్డ్ మెడల్ మ్యాచ్ ఆడేందుకు తనను అనుమతించాలన్నది ఆమె మొదటి డిమాండ్. కానీ నిబంధనలను ఉటంకిస్తూ.. ఆమె డిమాండ్ వెంటనే తిరస్కరించబడింది. దీంతో వినేష్ ఈ ఈవెంట్‌లో తనకు రజత పతకం ఇవ్వాలని కోరింది. ఈ కేసులో విచారణ అనంతరం మంగళవారం (ఆగస్టు 13) రాత్రికి నిర్ణయం రావాల్సి ఉండగా.. మళ్లీ వాయిదా పడింది. వినేష్ కేసులో CAS తన నిర్ణయాన్ని ఆగస్టు 16వ తేదీ రాత్రి 9.30 గంటలకు వెలువరించనుంది. దీంతో వినేష్ ప‌త‌కంపై ఉత్కంఠ మ‌రో మూడు రోజులు కొన‌సాగ‌నుంది. 

Tags:    

Similar News