T20 World Cup : దక్షిణాఫ్రికాకు చెమ‌ట‌లు ప‌ట్టించిన అమెరికా.. అయినా ఓడిపోయింది..!

సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో అమెరికాను ఓడించింది. వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా జరుగుతున్న ఈ సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది.

By :  Eha Tv
Update: 2024-06-20 03:03 GMT

సూపర్-8 తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 18 పరుగుల తేడాతో అమెరికాను ఓడించింది. వెస్టిండీస్‌లోని ఆంటిగ్వా వేదికగా జరుగుతున్న ఈ సూపర్-8 గ్రూప్-2 మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 194 పరుగులు చేసింది. అనంతరం 20 ఓవర్లలో అమెరికా జట్టు ఆరు వికెట్లకు 176 పరుగులు మాత్రమే చేయగలిగింది. అమెరికా ఇన్నింగ్స్‌లో కగిసో రబడ 19వ ఓవర్‌లో హర్మీత్ సింగ్ వికెట్ పడగొట్టి మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. చివరి రెండు ఓవర్లలో అమెరికాకు 28 పరుగులు కావాలి. అప్పుడు క్రీజులో హర్మీత్, ఆండ్రీస్ గౌస్ ఉన్నారు. తొలి బంతికే హర్మీత్ క్యాచ్ ఔట్ అయ్యాడు. 22 బంతుల్లో 38 పరుగులు చేసి అద్భుత‌మైన‌ ఇన్నింగ్స్ ఆడాడు. గౌస్‌తో కలిసి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే హర్మీత్ ఔట్ కావడంతో మ్యాచ్ తలకిందులైంది. 19వ ఓవర్‌లో రబడ రెండు పరుగులు చేయగా.. చివరి ఓవర్‌లో అమెరికా విజయానికి 26 పరుగులు అవసరం కాగా ఆ జట్టు ఏడు పరుగులు మాత్రమే చేయగలిగింది. గౌస్ 47 బంతుల్లో ఐదు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

అంతకుముందు దక్షిణాఫ్రికా తరఫున క్వింటన్ డికాక్ 74 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. క్వింటన్ డి కాక్, కెప్టెన్ ఐడెన్ మార్క్రామ్‌ల మధ్య రెండో వికెట్‌కు 60 బంతుల్లో 110 పరుగుల భాగస్వామ్యం ఏర్ప‌డ‌టంతో మంచి స్కోరు సాధించ‌గ‌లిగింది, 40 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 74 పరుగులు చేసిన డికాక్ ఇన్నింగ్స్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. మార్క్రామ్ 46 పరుగులు చేశాడు. క్లాసెన్ (36*), స్టబ్స్ (20*) 30 బంతుల్లో అజేయంగా 53 పరుగులు జోడించారు. దీంతో స్కోరు 194 పరుగులకు చేరింది. అమెరికా బౌల‌ర్ల‌లో నేత్రవాల్కర్ 21 పరుగులిచ్చి రెండు వికెట్లు, హర్మీత్ 24 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశారు. ఇక ఈ ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా ఐదో విజయం సాధించింది.  

Tags:    

Similar News