Shahid Afridi : గంభీర్ ఇంటర్వ్యూలు చాలా పాజిటివ్‌గా ఉంటాయి.. ఆయ‌న‌కు ఇదో పెద్ద అవకాశం..!

భారత మాజీ వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను టీమిండియా కొత్త కోచ్‌గా బీసీసీఐ నియమించింది.

By :  Eha Tv
Update: 2024-07-12 12:15 GMT

భారత మాజీ వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్‌ను టీమిండియా కొత్త కోచ్‌గా బీసీసీఐ నియమించింది. శ్రీలంకతో జరిగే సిరీస్ నుంచి గంభీర్ బాధ్యతలు స్వీకరించనున్నాడు. గంభీర్ హెడ్ కోచ్ అయిన తర్వాత పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ స్పందించాడు. గంభీర్ నియామ‌కంపై సానుకూల నిర్ష‌య‌మ‌ని అభివర్ణించిన ఆఫ్రిది.. కొత్త పాత్రలో తనదైన ముద్ర వేయడానికి గంభీర్‌కు ఇదొక మంచి అవకాశమని పేర్కొన్నాడు.

T20 ప్రపంచ కప్ 2007, 2011 ODI ప్రపంచ కప్ విజేత జట్టులో భాగమైన గౌతమ్ గంభీర్ ఇప్పుడు టీమ్ ఇండియా ప్రధాన కోచ్ పాత్రలో కనిపించనున్నాడు. గంభీర్ కోచ్ అయిన తర్వాత షాహిద్ అఫ్రిది స్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. నా ప్రకారం గౌతమ్ గంభీర్‌కు ఇదో పెద్ద అవకాశం అని చెప్పాడు. ఈ అవకాశాన్ని అత‌డు ఎలా ఉపయోగించుకుంటాడు అనేది అత‌డిపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు అతడి ఇంటర్వ్యూలు వింటే చాలా పాజిటివ్ విషయాలు మాట్లాడతాడని పేర్కొన్నాడు.

భారత జట్టు T20 ప్రపంచ కప్ 2007, ODI ప్రపంచ కప్ 2011 ట్రోఫీలను గెలుచుకున్నప్పుడు గంభీర్ విజేత జట్టులో సభ్యుడు. అతడు రెండు టోర్నీల ఫైనల్స్‌లో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. గౌతమ్ గంభీర్ 2007 టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో 54 బంతుల్లో 75 పరుగులు చేశాడు. 2011 వన్డే ప్రపంచకప్ ఫైనల్‌లో 122 బంతుల్లో 97 పరుగులు స్కోర్ చేశాడు.

Tags:    

Similar News