Rohit Sharma : ప్రధాని మోదీకి రోహిత్ శర్మ ధన్యవాదాలు

11 ఏళ్ల తర్వాత భారత్‌కు ఐసీసీ ట్రోఫీని అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం ప్రధాని మోదీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపాడు.

By :  Eha Tv
Update: 2024-07-01 04:39 GMT

11 ఏళ్ల తర్వాత భారత్‌కు ఐసీసీ ట్రోఫీని అందించిన కెప్టెన్ రోహిత్ శర్మ సోమవారం ప్రధాని మోదీ శుభాకాంక్షలకు ధన్యవాదాలు తెలిపాడు. ప్రధాని ట్వీట్‌ను హిట్‌మాన్ రీట్వీట్ చేసి.. ఆయ‌న‌ శుభాకాంక్షలకు కృతజ్ఞతలు తెలిపారు. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. విజ‌యం అనంత‌రం ప్ర‌ధాని మోదీ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇతర ఆటగాళ్లతో ఫోన్‌లో మాట్లాడారు.

రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ 17 ఏళ్ల తర్వాత టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. అంతకుముందు 2007లో అప్పటి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో టీమిండియా తొలి టైటిల్‌ను గెలుచుకుంది. ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. ఈ కారణంగానే ప్రధాని మోదీ రోహిత్‌కు ఫోన్‌లో అభినందనలు తెలిపి ట్వీట్ చేశారు. దీనికి హిట్ మ్యాన్ సోమవారం సమాధానం ఇచ్చాడు. రోహిత్ ట్వీట్‌లో.. నరేంద్ర మోదీ సార్, మీ శుభాకాంక్షలకు చాలా కృతజ్ఞతలు. కప్‌ని భార‌త్‌కు తీసుకురాగలిగినందుకు నేను, జట్టు చాలా గర్వంగా భావిస్తున్నాము. క‌ప్‌ ఇంటికి తిరిగి తీసుకురావడం మాకు చాలా ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నాడు.

అంత‌కుముందు ప్రధాని మోదీ రోహిత్ శర్మను ప్రశంసిస్తూ.."ప్రియమైన రోహిత్, మీరు అత్యుత్తమ ప్రతిరూపం. మీ దూకుడు మనస్తత్వం, బ్యాటింగ్, కెప్టెన్సీ భారత జట్టుకు కొత్త కోణాన్ని అందించాయి. మీ T20 కెరీర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఈ ఉదయం మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది అన్నారు.

ఫైనల్ మ్యాచ్ అనంతరం ప్రధాని భారత జట్టుతో ఫోన్‌లో మాట్లాడారు.. అద్భుతమైన కెప్టెన్సీ చేసిన రోహిత్ శర్మను అభినందించారు. రోహిత్‌ T20 కెరీర్‌ను ప్రశంసించారు. ఫైనల్‌లో విరాట్ కోహ్లి ఇన్నింగ్స్‌ను, భారత క్రికెట్‌కు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఆఖరి ఓవర్లో హార్దిక్ పాండ్యా, క్యాచ్ పట్టినందుకు సూర్యకుమార్ యాదవ్‌ను ప్రధాని మోదీ ప్రశంసించారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా సేవ‌ల‌ను కూడా ప్రశంసించారు. భారత క్రికెట్‌కు రాహుల్ ద్రవిడ్ చేసిన కృషికి ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News