THE ULTIMATE JATT : ధావన్ తనకు ఎంత ముఖ్యమో ఒక్క మాట‌లో చెప్పిన రోహిత్‌

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిమాన ఓపెనింగ్ భాగస్వామి, సన్నిహితుడు శిఖర్ ధావన్ రిటైర్మెంట్‌పై ఒక రోజు తర్వాత స్పందించాడు

Update: 2024-08-25 11:00 GMT

భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ తన అభిమాన ఓపెనింగ్ భాగస్వామి, సన్నిహితుడు శిఖర్ ధావన్ రిటైర్మెంట్‌పై ఒక రోజు తర్వాత స్పందించాడు. ఈ మేర‌కు రోహిత్ నాలుగు ఫోటోలతో ఎక్స్‌లో ఒక పోస్ట్‌ను పోస్ట్ చేశాడు. ధావన్ తనకు ఎంత ముఖ్యమో చెప్పాడు. ధావన్ శనివారం తెల్లవారుజామున అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీమిండియాలో రోహిత్‌తో కలిసి ధావన్ చాలా మ్యాచ్‌ల్లో ఓపెనింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. వీరిద్దరి జోడీ భారత్‌లో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీగా పరిగణించబడుతుంది. వీరిద్దరూ అభిమానులకు ఒక‌ప్ప‌టి సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీలను గుర్తుకుతెచ్చారు. వీరిద్దరూ సచిన్-సౌరవ్‌ల రికార్డులను కూడా బద్దలు కొట్టారు.

రోహిత్ ధావన్ రిటైర్మెంట్‌పై పోస్ట్ లో.. ధావన్ ఉండటంతో త‌న‌ పని తేలికైనట్లు చెప్పాడు. డ్రెస్సింగ్ రూమ్‌ను పంచుకోవడం నుండి ఫీల్డ్‌లో జీవితకాల జ్ఞాపకాలను సృష్టించడం వరకూ.. త‌ను ఎల్లప్పుడూ మరో ఎండ్‌లో నా పనిని సులభతరం చేసాడు. ది అల్టిమేట్ జాట్" అని రోహిత్ పోస్ట్ చేశాడు.

ప్రముఖ బ్రాడ్‌కాస్టర్ గౌరవ్ కపూర్ షోలో రోహిత్ మాట్లాడుతూ.. ధావన్ తనకు చాలా మంచి మిత్రుడని.. అత‌ను తన వెంట ఉన్నప్పుడు ఎప్పుడూ చింతించనని రోహిత్ చెప్పాడు. అభిమానులు కూడా ఇద్దరి బంధం చాలా మంచిదని భావిస్తారు. ధావన్ కుమారుడు జోర్వార్ అతనితో ఉన్నప్పుడు.. అతడు టీమిండియా పర్యటనల‌లో ధావన్ కంటే రోహిత్‌తో ఎక్కువగా ఉండేవాడు.

Tags:    

Similar News