Ricky Ponting : పంజాబ్ కింగ్స్ హెడ్‌ కోచ్‌గా రికీ పాంటింగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 రాబోయే సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు రికీ పాంటింగ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించింది.

Update: 2024-09-18 13:35 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 రాబోయే సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ జట్టు రికీ పాంటింగ్‌ను ప్రధాన కోచ్‌గా నియమించింది. పంజాబ్ కింగ్స్ పాత కోచ్ ట్రెవర్ బేలిస్ స్థానంలో పాంటింగ్ హెడ్ కోచ్‌గా ఎంపిక‌య్యాడు. ఏడేళ్ల పాటు ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఉన్న పాంటింగ్.. పంజాబ్ కింగ్స్‌తో చేరాడు. రికీ పాంటింగ్ మంగళవారం పంజాబ్‌తో నాలుగు సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. మిగిలిన సహాయక సిబ్బందికి సంబంధించి పాంటింగ్ నిర్ణయం తీసుకోనున్నాడు.

పాంటింగ్ మార్గదర్శకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచినప్పటికీ.. ఐపీఎల్ టైటిల్‌ను గెలవలేకపోయింది. ఢిల్లీ జట్టు 2020లో ఫైనల్స్‌కు చేరుకుంది. పాంటింగ్ ఇంతకు ముందు ముంబై ఇండియన్స్‌కు కోచ్‌గా కూడా ఉన్నాడు. 2008లో లీగ్ ప్రారంభమైనప్పటి నుండి పంజాబ్ జట్టు కూడా IPL టైటిల్‌ను గెలుచుకోలేదు. పాంటింగ్ ఈ లోటును భర్తీ చేస్తారని జట్టులోని నలుగురు సహ-యజమానులు ఆశిస్తున్నారు. ఈ మేర‌కు పంజాబ్ కింగ్స్ జట్టు కొత్త కోచ్‌గా రికీ పాంటింగ్‌ను నియమిస్తున్నట్లు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించారు.

పంజాబ్ కింగ్స్ ప్రధాన కోచ్ అయిన తర్వాత రికీ పాంటింగ్ మాట్లాడుతూ.. 'నేను పంజాబ్ కింగ్స్‌తో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాను. కొత్త జట్టుతో కలిసి ఐపిఎల్ టైటిల్‌ను గెలవడానికి సిద్ధమ‌వుతామ‌ని అన్నాడు. ఇక‌ 2014లో పంజాబ్ జట్టు ఫైనల్ చేరి జట్టులో తరచూ మార్పులు చేర్పులు చేస్తూ విమర్శలు ఎదుర్కొంటోంది.

Tags:    

Similar News