Ravindra Jadeja : టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన‌ జడేజా

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

By :  Eha Tv
Update: 2024-06-30 12:09 GMT

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తర్వాత భారత జట్టు స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా అంతర్జాతీయ టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఆయన ఈ సమాచారాన్ని అందించారు. శనివారం బార్బడోస్‌లో దక్షిణాఫ్రికాను ఏడు పరుగుల తేడాతో ఓడించి భారత్ వ‌ర‌ల్డ్ క‌ప్‌ టైటిల్‌ను కైవసం చేసుకుంది.

జడేజా పోస్టులో.. "నేను T20 ఇంటర్నేషనల్స్‌కు హృదయపూర్వకంగా వీడ్కోలు పలుకుతున్నాను. గర్వంతో దూసుకుపోతున్న దృఢమైన గుర్రంలా.. నేను ఎల్లప్పుడూ నా దేశం కోసం నా అత్యుత్తమమైన ఆట‌ను అందించాను. ఇతర ఫార్మాట్లలో ఆట‌ను కొనసాగిస్తాను. T20 ప్రపంచ కప్‌ను గెలుచుకున్నాం. ఒక కల నిజమైంది. నా T20 అంతర్జాతీయ కెరీర్‌కు ఆ జ్ఞాపకం పరాకాష్టగా నిలిచింది. తిరుగులేని మద్దతుకు ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చాడు.

2024లో అమెరికా, వెస్టిండీస్‌ వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్‌లో రవీంద్ర జడేజా పెద్ద‌గా రాణించలేకపోయాడు. బౌలింగ్‌, బ్యాటింగ్‌లో కూడా ప్రభావం చూపలేకపోయాడు. టోర్నీలో మొత్తం ఎనిమిది మ్యాచ్‌లు ఆడి 35 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో జ‌డేజాకు ఒక్క వికెట్ మాత్రమే దక్కింది.

Tags:    

Similar News