Viral Video : అమ్మాయి కాదు.. లేడి పిల్ల‌.. అలానే దూకి ప‌ట్టేసింది..!

ఇంగ్లాండ్‌లో హండ్రెడ్ ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్‌ జరుగుతుంది. అయితే నిన్న జ‌రిగిన‌ 14వ మ్యాచ్‌కు సంబంధించిన ఓ క్యాచ్ గురించి ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారు.

Update: 2024-08-04 04:20 GMT

ఇంగ్లాండ్‌లో హండ్రెడ్ ఉమెన్స్ క్రికెట్ టోర్నమెంట్‌ జరుగుతుంది. అయితే నిన్న జ‌రిగిన‌ 14వ మ్యాచ్‌కు సంబంధించిన ఓ క్యాచ్ గురించి ఇప్పుడు అంతా మాట్లాడుతున్నారు. నాటింగ్‌హామ్‌లో జ‌రిగిన ఆ మ్యాచ్‌లో వెల్ష్ ఫైర్ ప్లేయర్ అద్భుతమైన క్యాచ్‌తో అంద‌రినీ ఆశ్చర్యపరిచింది.

ది హండ్రెడ్ ఉమెన్స్ టోర్నమెంట్ లో 14వ మ్యాచ్ వెల్ష్ ఫైర్, ట్రెంట్ రాకెట్స్ జ‌ట్ల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ట్రెంట్ రాకెట్స్ 130 పరుగులు చేసింది. ట్రెంట్ రాకెట్స్ ఇన్నింగ్స్ న‌డుస్తున్న స‌మ‌యంలో వెల్ష్ ఫైర్ ప్లేయర్ ఫోబ్ ఫ్రాంక్లిన్ ముందుకు పరిగెడుతూ అద్భుతమైన క్యాచ్ పట్టింది. 7.2 ఓవర్లలో ఇది జరిగింది. వెల్ష్ ఫైర్ బౌలర్ జార్జియా డేవిస్ వేసిన బంతిని నటాషా వ్రైత్.. డీప్ మిడ్ వికెట్ వైపు ఏరియల్ షాట్ ఆడింది. బౌండరీపై నిలబడిన ఫోబ్ ఫ్రాంక్లిన్ పరుగున వచ్చి గాలిలోకి దూకి అద్భుతమైన క్యాచ్ పట్టింది.

ఫోబ్ ఫ్రాంక్లిన్ అద్భుత ఫీల్డింగ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బ్యాట్స్‌మెన్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. నటాషా వ్రైత్ 24 బంతుల్లో 28 పరుగులు చేసింది. జార్జియా డేవిస్ 23 పరుగులిచ్చి ఒక వికెట్ తీసింది. ప్ర‌స్తుతం ఫోబ్ ఫీల్డింగ్ చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది.

ట్రెంట్ రాకెట్స్ మొదట బ్యాటింగ్ చేసి 130 పరుగులు చేసింది. కెప్టెన్ నటాలీ సివర్ బ్రంట్ అత్యధికంగా 37 పరుగులు చేసింది. జెస్ జోనాసన్ రెండు వికెట్లు తీసింది. లక్ష్యాన్ని ఛేదించిన వెల్ష్ ఫైర్ 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని నమోదు చేసింది. వికెట్ కీపర్ సారా బ్రైస్ 51 పరుగులతో మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడింది.

Tags:    

Similar News