Paris Olympics Day 7 Schedule : మను భాకర్ మూడో ప‌త‌కం తెస్తుందా.? నేటి షెడ్యూల్ ఇదే..!

పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు రెండు పతకాలు సాధించిన మహిళా షూటర్ మను భాకర్ పారిస్ గేమ్స్‌లో ఏడో రోజైన శుక్రవారం 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్‌లో పోటీపడనుంది.

By :  Eha Tv
Update: 2024-08-02 03:06 GMT

పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటివరకు రెండు పతకాలు సాధించిన మహిళా షూటర్ మను భాకర్ పారిస్ గేమ్స్‌లో ఏడో రోజైన శుక్రవారం 25 మీటర్ల పిస్టల్ క్వాలిఫికేషన్‌లో పోటీపడనుంది. మను మరోసారి మెరుగ్గా రాణిస్తుంద‌ని అంచనాలు ఉన్నాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు హెచ్‌ఎస్ ప్రణయ్‌ను ఓడించి క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న లక్ష్య సేన్ సెమీ-ఫైనల్‌కు చేరేందుకు క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. ఇక భారత పురుషుల హాకీ జట్టు తన చివరి గ్రూప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

పారిస్ ఒలింపిక్స్ ఏడో రోజు భారత్ షెడ్యూల్ ఇలా..

గోల్ఫ్

- పురుషుల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే రెండవ రౌండ్: శుభంకర్ శర్మ, గగన్‌జీత్ భుల్లర్ (మధ్యాహ్నం 12.30 నుండి)

షూటింగ్

- 25 మీటర్ల పిస్టల్ మహిళల అర్హత: ఇషా సింగ్, మను భాకర్ (మధ్యాహ్నం 12.30 నుంచి)

- స్కీట్ పురుషుల అర్హత - 1వ రోజు: అనంత్‌జిత్ సింగ్ నరుకా (మధ్యాహ్నం 1.00 గంటల నుండి)

విలువిద్య

- మిక్స్‌డ్ టీమ్ 1/8 ఎలిమినేషన్ రౌండ్: భారతదేశం vs ఇండోనేషియా (అంకిత భకత్/ధీరజ్ బొమ్మదేవర vs దియాండా కొరునిస్సా/ఆరిఫ్ పంగేస్తు) (మధ్యాహ్నం 1.20 నుండి)

జూడో

- మహిళల +78 కేజీల ఎలిమినేషన్ రౌండ్ ఆఫ్ 32: తులికా మన్ vs ఇడాలిస్ ఓర్టిజ్ (మధ్యాహ్నం 1.30 నుండి)

సెయిలింగ్‌

- మహిళల డింగీ రేస్-3: నేత్ర కుమనన్ (సాయంత్రం 3.45 నుంచి)

- పురుషుల డింగీ రేస్-3: విష్ణు శరవణన్ (సాయంత్రం 7.05 నుండి)

హాకీ

- ఆస్ట్రేలియా vs ఇండియా గ్రూప్ స్టేజ్ మ్యాచ్ (సాయంత్రం 4.45 నుండి)

బ్యాడ్మింటన్

- పురుషుల సింగిల్స్ క్వార్టర్-ఫైనల్: లక్ష్య సేన్ vs చు టిన్ చెన్ (సాయంత్రం 6.30 నుండి)

వ్యాయామ క్రీడలు

- మహిళల 5000మీ హీట్-1: అంకిత ధ్యాని (రాత్రి 9.40 నుంచి)

- మహిళల 5000మీ హీట్-2: పారుల్ చౌదరి (రాత్రి 10.06 నుంచి)

- పురుషుల షాట్‌పుట్ అర్హత: తజిందర్‌పాల్ సింగ్ టూర్ (రాత్రి 11.40 నుండి)

Tags:    

Similar News