Paris Olympics 2024 : ఐదో రోజు భారత్ షెడ్యూల్ ఇదే..!

పారిస్ ఒలింపిక్స్‌లో నాలుగో రోజైన మంగళవారం మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.

By :  Eha Tv
Update: 2024-07-31 01:51 GMT

పారిస్ ఒలింపిక్స్‌లో నాలుగో రోజైన మంగళవారం మను భాకర్, సరబ్జోత్ సింగ్ జోడీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది. నేడు ఐదో రోజు. మనిక బత్రా టేబుల్ టెన్నిస్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించగా.. టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహై కూడా నేడు బాక్సింగ్‌ రింగ్‌లోకి దిగ‌నుంది.

రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు గ్రూప్ దశలోని తన రెండో మ్యాచ్ నేడు ఆడ‌నుంది. సింధు క్రిస్టీన్ కుబా(ఎస్టోనియా)తో తలపడనుండ‌గా.. లక్ష్య సేన్, హెచ్ఎస్ ప్రణయ్ జోడీ కూడా తమ తమ గ్రూప్ మ్యాచ్‌ల‌లో పోటీపడనున్నారు. ఆర్చ‌రీలో భజన్ కౌర్ అద్భుతమైన ప్రదర్శన తర్వాత.. అనుభవజ్ఞులైన ఆర్చర్స్ దీపికా కుమారి, తరుణ్‌దీప్ రాయ్ నుండి కూడా మెరుగైన ప్రదర్శన ఆశిస్తున్నారు అభిమానులు. దీపిక, తరుణ్‌దీప్‌లు వరుసగా మహిళల, పురుషుల సింగిల్స్ 1/32 ఎలిమినేషన్ స్టేజ్‌లో పోటీపడతారు.

పారిస్ ఒలింపిక్స్ ఐదో రోజు భారత్ షెడ్యూల్ ఇలా..

షూటింగ్

- 50 మీ రైఫిల్ 3 స్థానాలు పురుషుల అర్హత: ఐశ్వర్య ప్రతాప్ సింగ్ తోమర్ మరియు స్వప్నిల్ కుసలే (మధ్యాహ్నం 12:30 నుండి)

- ట్రాప్ మహిళల అర్హత: శ్రేయసి సింగ్ మరియు రాజేశ్వరి కుమారి (మధ్యాహ్నం 12:30 నుండి)

బ్యాడ్మింటన్

- మహిళల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): PV సింధు vs క్రిస్టిన్ కుబా (ఎస్టోనియా) (12:50 pm నుండి)

- పురుషుల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): లక్ష్య సేన్ vs జోనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా) (మధ్యాహ్నం 1:40 నుండి)

- పురుషుల సింగిల్స్ (గ్రూప్ స్టేజ్): HS ప్రణయ్ vs డక్ ఫాట్ లే (వియత్నాం) (రాత్రి 11 గంటల నుండి)

టేబుల్ టెన్నిస్

- మహిళల సింగిల్స్ (చివరి 32 రౌండ్): శ్రీజ అకుల vs జియాన్ జెంగ్ (సింగపూర్) (2:20 PM IST)

- మహిళల సింగిల్స్ (రౌండ్ ఆఫ్ 16): మనిక బాత్రా (రాత్రి 8:30 గంటల నుంచి)

బాక్సింగ్

- మహిళల 75 కేజీలు (చివరి 16 రౌండ్లు): లోవ్లినా బోర్గోహైన్ vs సున్నివా హాఫ్‌స్టెడ్ (నార్వే) (మధ్యాహ్నం 3:50 నుండి)

- పురుషుల 71 కేజీలు (చివరి 16 రౌండ్లు): నిశాంత్ దేవ్ vs జోస్ గాబ్రియెల్ రోడ్రిగ్జ్ టెనోరియో (ఈక్వెడార్) (12:18 pm నుండి)

విలువిద్య

- మహిళల సింగిల్స్: 1/32 ఎలిమినేషన్ స్టేజ్: దీపికా కుమారి (మధ్యాహ్నం 3:56 నుండి)

గుర్రపు స్వారీ

- ఇండివిజువల్ డ్రస్సేజ్ గ్రాండ్ ప్రిక్స్ డే 2: అనూష్ అగర్వాలా (మధ్యాహ్నం 1:30 నుండి)

- పురుషుల సింగిల్స్: 1/32 ఎలిమినేషన్ స్టేజ్: తరుణ్‌దీప్ రాయ్ (రాత్రి 9:15 నుండి)

Tags:    

Similar News