Paris Olympics : రెజ్లింగ్‌లో ప‌త‌కం వ‌చ్చేనా.? 14వ రోజు భార‌త్ షెడ్యూల్ ఇదే..

పారిస్ ఒలింపిక్స్‌ 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతక పోరుకు సిద్ద‌మ‌వుతున్నాడు.

Update: 2024-08-09 03:35 GMT

పారిస్ ఒలింపిక్స్‌ 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు రెజ్లర్ అమన్ సెహ్రావత్ కాంస్య పతక పోరుకు సిద్ద‌మ‌వుతున్నాడు. గురువారం జరిగిన పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ విభాగంలో సెమీ ఫైనల్లో జపాన్‌కు చెందిన టాప్ సీడ్ రీ హిగుచి చేతిలో అమన్ ఓడిపోయాడు. ఈ విధంగా గోల్డ్ మెడల్ సాధించాలన్న అతని కల చెదిరిపోయినా.. కాంస్య పతకం సాధించే అవకాశం ఉంది. గోల్ఫర్లు అదితి అశోక్, దీక్షా దాగర్ కూడా మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు.

ప్రీ-క్వార్టర్‌ఫైనల్‌, క్వార్టర్‌ఫైనల్స్‌లో అమన్‌ అద్భుత ప్రదర్శన చేశాడు. అయితే హిగుచిపై దూకుడు ఆటను ప్రదర్శించలేక.. ఒక్క పాయింట్ కూడా సాధించలేకపోయాడు. శుక్రవారం రాత్రి 9.45 గంటలకు జరిగే కాంస్య పతక పోరులో ప్యూర్టో రికోకు చెందిన డారియన్ టోయ్ క్రూజ్‌తో తలపడనున్నాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో అల్బేనియాకు చెందిన జెలిమ్‌ఖాన్ అబాకరోవ్‌పై (12-0) విజయంతో సెమీ-ఫైనల్‌కు చేరుకోవడం ద్వారా అమన్ రెజ్లింగ్‌లో పతక ఆశలను పెంచాడు.

పారిస్ ఒలింపిక్ క్రీడల 14వ రోజు భారత్ షెడ్యూల్ ఇలా..

గోల్ఫ్

- మహిళల వ్యక్తిగత విభాగం: అదితి అశోక్, దీక్షా దాగర్ (మధ్యాహ్నం 12.30 నుండి)

అథ్లెటిక్స్

- మహిళల 4x400 మీటర్ల రిలే మొదటి రౌండ్: (మధ్యాహ్నం 2.10 నుండి)

- పురుషుల 4x400 మీటర్ల రిలే మొదటి రౌండ్: మధ్యాహ్నం 2.35 నుండి)

రెజ్లింగ్

- పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ కాంస్య పతక మ్యాచ్: అమన్ సెహ్రావత్ vs డారియన్ టోయ్ క్రూజ్ (ప్యూర్టో రికో) (రాత్రి 9.45 గంటల నుంచి)

Tags:    

Similar News