ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ పరిస్థితి.. దొంగిలించిన ఫోన్‌కు ఈఎంఐ కట్టాల్సిన దుస్థితి..!

ఛాంపియన్స్‌ ట్రోఫీలో పాక్‌ పరిస్థితి.. దొంగిలించిన ఫోన్‌కు ఈఎంఐ కట్టాల్సిన దుస్థితి..!

By :  ehatv
Update: 2025-02-25 10:58 GMT

ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఆతిథ్య జట్టు పాక్‌ ఔట్‌ అయింది. అధికారికంగా భారత జట్టు సెమీఫైనల్‌లోకి అడుగుపెట్టింది. సోమవారం బంగ్లాదేశ్‌ను న్యూజిలాండ్‌ ఓడించడంతో అటు పాకిస్తాన్ ఇంటిదారి పట్టింది, ఇటు భారత జట్టు అధికారికంగా సెమీస్‌ దారి పట్టింది. లీగ్‌ దశ నుంచి పాక్‌ జట్టు నిష్క్రమించడం విశేషం. మూడు దశాబ్దాల తర్వాత సొంత గడ్డపై జరుగుతున్న ఐసీసీ టోర్నీలో కేవలం ఆరు రోజుల్లోనే పాక్ జట్టు నిష్క్రమించింది. మరో విషయం ఏంటంటే డిఫెండింగ్ ఛాంపియన్‌ హోదాలో ఛాంపియన్స్‌ ట్రోఫీలో బరిలోకి దిగిన పాకిస్తాన్ రెండు జట్లతో జరిగిన మ్యాచులో ఓడిపోయింది. సోమవారం నాటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించడంతో పాకిస్థాన్.. నిష్క్రమణ ఖరారైంది. 29 ఏళ్ల తర్వాత ఐసీసీ టోర్నమెంట్‌కు ఆతిథ్యమిస్తున్న పాకిస్థాన్ టోర్నీ రేస్ నుంచి తప్పుకోవడంతో ఆ జట్టుపై విపరీతమైన ట్రోల్స్‌ నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆ జట్టుపై క్రికెట్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. ‘టోర్నీ నుంచి తప్పుకున్నా ఆతిథ్యం ఇవ్వడం.. చోరీకి గురైన ఫోన్‌కు ఈఎంఐలు కట్టడం లాంటిదే’ అని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. 

Tags:    

Similar News