Viral Video: ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచాక చిన్నపిల్లాడిలా ఏడ్చిన దిగ్గజ టెన్నిస్ ఆటగాడు..!
ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్(Novak Djokovic) టెన్నిస్(Tennis) సింగిల్స్ ఫైనల్లో(Singles Final) కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)ను వరుస సెట్లలో ఓడించాడు.
ప్రపంచ మాజీ నంబర్ వన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్(Novak Djokovic) టెన్నిస్(Tennis) సింగిల్స్ ఫైనల్లో(Singles Final) కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)ను వరుస సెట్లలో ఓడించాడు. దీంతో ఒలింపిక్స్(Olympic Games)లో తొలి బంగారు పతకం సాధించాడు. స్పెయిన్(Spain)కు చెందిన అల్కరాజ్‌పై జొకోవిచ్ 7-6, 7-6 తేడాతో విజయం సాధించి తన 24 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్‌లో మరో ఘనత సాధించాడు. జకోవిచ్ ఓపెన్ ఎరా చరిత్రలో ఒలింపిక్ బంగారు పతకాన్ని గెలుచుకున్న అతి పెద్ద ఆటగాడు. ఇది కాకుండా, పురుషుల, మహిళల విభాగాల్లో అత్యధిక వారాల పాటు నంబర్ 1 ర్యాంక్‌లో ఉన్న ఆటగాడు కూడా..
ఫైనల్ మ్యాచ్‌లో జొకోవిచ్, కార్లోస్ మధ్య పోరు రసవత్తరంగా జరిగింది. జకోవిచ్ 7-6(3), 7-6(2)తో రెండు సెట్లను కైవసం చేసుకుని స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఒలింపిక్స్‌లో తొలి పతకం సాధించిన తర్వాత జకోవిచ్ చిన్నపిల్లాడిలా ఏడవడం మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పతకం గెలిచిన తర్వాత కుటుంబసభ్యులు, సహాయక సిబ్బందితో కలిసి సంబరాలు జరుపుకుంటున్న సమయంలో జకోవిచ్ బిగ్గరగా ఏడుస్తుండగా.. వేలాది మంది అతడి విజయం పట్ల ఆనందంలో ఉత్సాహపరచడం వీడియోలో చూడవచ్చు. స్వర్ణ పతకం సాధించిన నొవాక్ డికోవిచ్‌ను సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) అభినందించాడు.
విజయం తర్వాత అల్కారాజ్ గురించి జొకోవిచ్ మాట్లాడుతూ.. అతడు గొప్ప మ్యాచ్ ఆడాడు. అతడికి ఉజ్వల భవిష్యత్తు ఉంది. అతడు తన సర్వీస్‌ను మెరుగుపరచుకోవాల్సి ఉందని మెలకువలు సూచించాడు.