Dhoni Kohli: కోహ్లీ, ధోని ఎంత ట్యాక్స్ చెల్లించారో తెలుసా?
ఎంత ట్యాక్స్ చెల్లించారో
By : Sreedhar Rao
Update: 2024-09-05 04:56 GMT
విరాట్ కోహ్లీ ప్రస్తుతం క్రికెట్‌కు కాస్త విరామం ఇచ్చాడు. అతను చివరిసారిగా శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో ఆడాడు. బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19న ప్రారంభమయ్యే రెండు-టెస్టుల సిరీస్‌లో కోహ్లీ మెరుపులు మెరిపిస్తాడని భావిస్తున్నారు. క్రికెట్ కు దూరంగా ఉన్నా కోహ్లీ వార్తల్లో నిలిచాడు. ఫార్చ్యూన్ ఇండియా నివేదిక ప్రకారం, విరాట్ కోహ్లీ 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 66 కోట్ల పన్ను చెల్లించాడు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లించిన సెలెబ్రిటీల జాబితాలో విరాట్ కోహ్లీ రూ. 66 కోట్ల పన్ను చెల్లించాడు. ఇదే క్రీడాకారులలో అత్యధికం. దీంతో విరాట్ ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
ఎంఎస్ ధోని (రూ. 38 కోట్లు), సచిన్ టెండూల్కర్ (రూ. 28 కోట్లు) తర్వాతి రెండు స్థానాల్లో నిలిచారు. సౌరవ్ గంగూలీ (రూ. 23 కోట్లు), హార్దిక్ పాండ్యా (రూ. 13 కోట్లు) కూడా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నారని నివేదిక పేర్కొంది. 80 కోట్ల పన్ను చెల్లించిన తర్వాత నటుడు తలపతి విజయ్ ఓవర్ ఆల్ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.