Mohammed Siraj : డ్రీమ్ కారు కొన్న సిరాజ్.. ప్రత్యేకతలివే..!
భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలే తన బిజీ షెడ్యూల్ ముగించుకున్నాడు. సమయం దొరకడంతో సిరాజ్ తన కుటుంబంతో గడుపుతున్నాడు
భారత జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఇటీవలే తన బిజీ షెడ్యూల్ ముగించుకున్నాడు. సమయం దొరకడంతో సిరాజ్ తన కుటుంబంతో గడుపుతున్నాడు. ఈ క్రమంలో తను తన డ్రీమ్ నెరవేర్చుకున్నాడు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో ఫోటోను షేర్ చేయడంతో పాటు.. క్యాప్షన్ కూడా రాశాడు.
మహమ్మద్ సిరాజ్ కొత్త కారుకు సంబంధించి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఒక పోస్ట్‌ను పంచుకున్నారు. అందులో అతను కొత్త కారు కొన్నట్లు చెప్పాడు. సిరాజ్‌తో పాటు అతని కుటుంబంను కూడా ఫోటోలో చూడొచ్చు.
మీ కలలకు పరిమితులు లేవు.. ఎందుకంటే అవి మిమ్మల్ని మరింత కష్టపడి పనిచేయడానికి.. మరిన్ని ప్రయత్నాలు చేయడానికి స్ఫూర్తినిస్తాయని సిరాజ్ డ్రీమ్ కార్ ఫోటో క్యాప్షన్‌లో రాశారు. నిలకడతో చేసే మీ ప్రయత్నాలే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాయి. నా కుటుంబం కోసం లాండ్ రోవర్ డ్రీమ్ కారును కొనుగోలు చేసేలా చేసిన దేవునికి కృతజ్ఞతలు. మీపై మీకు నమ్మకం ఉంటే మీరు అనుకున్నది సాధించవచ్చని రాశాడు.
మహ్మద్ సిరాజ్ కొనుగోలు చేసిన కారు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎల్‌డబ్ల్యుబి. దీని విలువ సుమారు రూ. 2.60 కోట్లు. ఇవి టాప్ మోడల్ కార్లు. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన 2996 సిసి ఇంజన్‌ని కలిగి ఉంటుంది. ఇది 10.42 kmpl మైలేజీని ఇస్తుంది. ఈ వేరియంట్‌లో 11 కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. ఇది 5 సీట్ల పెట్రోల్ కారు.