Manu Bhaker : సూర్యకుమార్ యాదవ్ ద‌గ్గ‌ర‌ టెక్నిక్స్‌ను నేర్చుకుంటున్న మను భాకర్

పారిస్ ఒలింపిక్స్-2024లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత యువ షూటర్ మను భాకర్ ఇప్పుడు క్రికెటర్‌గా మారాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది

Update: 2024-08-25 06:43 GMT

పారిస్ ఒలింపిక్స్-2024లో రెండు కాంస్య పతకాలు సాధించిన భారత యువ షూటర్ మను భాకర్ ఇప్పుడు క్రికెటర్‌గా మారాలనే తపనతో ఉన్నట్లు తెలుస్తోంది. మను చాలా క్రీడలు ఆడింది. ఇప్పుడు క్రికెట్‌లోనూ ప్రావీణ్యం సంపాదించేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ఇందుకోసం సూర్యకుమార్ యాదవ్‌ను కూడా కలిసింది. మను సోషల్ మీడియాలో.. భారత T20 కెప్టెన్‌ని కలిసిన‌ట్లు.. మిస్టర్ 360 డిగ్రీ అని పిలవబడే ఈ బ్యాట్స్‌మెన్ నుండి కొత్త గేమ్‌కు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తీసుకుంటున్నట్లు తెలిపింది.

ప్రస్తుతం మను మూడు నెలల విరామంలో ఉంది. పారిస్ ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. పారిస్ ఒలింపిక్స్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లలో మను కాంస్య పతకాలను గెలుచుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణి ఆమె.

పారిస్ నుండి తిరిగి వచ్చిన తర్వాత.. మను విరామం తీసుకుంటుంది.. దీంతో ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటుంది. ఈ క్ర‌మంలోనే ఆమె భారత టీ20 జట్టు కెప్టెన్ సూర్యకుమార్‌ను కలుసుకుంది. అందుకు సంబంధించిన‌ ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోతో పాటు మను ఇలా వ్రాసింది.. "భారత జ‌ట్టు మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాట్స్‌మెన్‌ను కలుసుకున్నాను.. కొత్త గేమ్ మెళుకువలను నేర్చుకున్నాను అని పేర్కొంది. ఈ ఫోటోలో సూర్యకుమార్ తన చేతులతో గన్ పోజ్ పట్టుకుని ఉండగా.. మను బ్యాట్ పట్టుకుని ఉంది.



మను షూటర్.. కానీ ఈ క్రీడను కెరీర్‌గా ఎంచుకునే ముందు ఆమె ఇతర క్రీడలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మను షూటింగ్‌కు ముందు మార్షల్ ఆర్ట్స్, జూడో, బాక్సింగ్ వంటి క్రీడలను కూడా ట్రై చేసింది. అయితే ఆ తర్వాత షూటింగ్ అంటే బాగా ఇష్టపడి ఈ క్రీడను కెరీర్‌గా ఎంచుకుంది.

Tags:    

Similar News