KL Rahul : వాళ్ల‌ది బిజినెస్ బ్యాగ్రౌండ్‌.. ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులపై విరుచుకుపడ్డ కేఎల్ రాహుల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్ కోసం ఈ ఏడాది మెగా వేలం జరగనుంది.

Update: 2024-08-27 04:09 GMT

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తదుపరి సీజన్ కోసం ఈ ఏడాది మెగా వేలం జరగనుంది. ఈ వేలానికి ముందు లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఫ్రాంచైజీ యజమానులపై విరుచుకుపడ్డాడు. ఫ్రాంచైజీ యజమానులు వ్యాపార నేపథ్యం ఉన్నవారని.. సరైన డేటా ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేసుకుంటారని అన్నాడు. IPL-2024లో రాహుల్ తన జట్టు యజమాని సంజీవ్ గోయెంకాతో మిడ్ ఫీల్డ్‌లో వాగ్వాదానికి దిగాడు. ఆ వీడియో వైరల్‌గా మారింది. అప్పటి నుండి రాహుల్ వ‌చ్చే సీజన్‌లో లక్నోను విడిచిపెట్టి వేరే జట్టులోకి వెళ్లవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి.

ఐపీఎల్ జట్ల యజమానులు డేటా ఆధారంగా ఆటగాళ్లను ఎంపిక చేస్తారని.. అయితే ఆ డేటా వారికి విజయం ప‌ట్ల హామీ ఇవ్వదని రాహుల్ నితిన్ కామత్ పోడ్‌కాస్ట్‌లో అన్నాడు. ఐపీఎల్ జట్ల యజమానులకు వ్యాపార నేపథ్యం ఉంటుంద‌ని పేర్కొన్నాడు. యజమాని జ‌ట్టు కూర్పుపై పరిశోధనలు చేస్తాడు.. ఆటగాళ్లను ఎంపిక చేస్తాడు, కానీ అతడు ప్రతి మ్యాచ్‌లో గెలుస్తామ‌నే హామీ ఇవ్వలేడు. య‌జ‌మానులు డేటా ఆధారంగా అత్యుత్తమ ఆటగాళ్లను ఎంచుకోవచ్చు.. ఆ ఆట‌గాళ్లు చాలా తక్కువగా ప్ర‌భావం చూపే అవ‌కాశం కూడా ఉంది. ప్రతీ క్రీడాకారుడు చెడ్డ రోజును అనుభవిస్తాడు. ఆటలో విజయానికి హామీ ఇచ్చేది ఏదీ లేదు. విజయానికి దారితీసే ఫార్ములా లేదు అన్నాడు. సంజీవ్ గోయెంకాతో మ‌న‌స్ప‌ర్ధ‌లు ఉన్న నేప‌థ్యంలో రాహుల్‌ ఇలాంటి వ్యాఖ్య‌లు చేయ‌డం హాట్ టాఫిక్‌గా మారింది.

రాహుల్ గత ఐపీఎల్ సీజ‌న్ చాలా చెత్తగా సాగింది. అతని బ్యాట్ నుంచి ప‌రుగులు, కెప్టెన్సీ నుంచి విజ‌యాలు రాలేదు. లక్నో 2022లో IPL అరంగేట్రం చేసింది. ఆ సీజన్‌లో ప్లేఆఫ్‌కు చేరుకుంది కానీ ఫైనల్స్ ఆడలేకపోయింది. తదుపరి సీజన్‌లో కూడా లక్నో జట్టు ప్లేఆఫ్‌కు చేరుకుంది. అయితే మరోసారి టైటిల్ మ్యాచ్‌కు చేరుకోలేకపోయింది. గతేడాది ప్లేఆఫ్‌కు కూడా చేరలేకపోయింది.

Tags:    

Similar News