Kolkata Knight Riders : కేకేఆర్ టీమ్ కోసం గంభీర్ స్థానంలో ఎవరు వచ్చారో తెలుసా.?

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీకి కొత్త మెంటార్‌గా డ్వేన్ బ్రావోను నియమించినట్లు ప్రకటించింది

Update: 2024-09-27 13:33 GMT

కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌కు ముందు ఫ్రాంచైజీకి కొత్త మెంటార్‌గా డ్వేన్ బ్రావోను నియమించినట్లు ప్రకటించింది. T20 ఫార్మాట్ లో లెజెండ్ బ్రేవో అని చెప్పొచ్చు. గాయం కారణంగా కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) 2024 నుండి తప్పుకున్న బ్రేవో అన్ని రకాల క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నట్లు ప్రకటించాడు. రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత, బ్రావో గౌతమ్ గంభీర్ స్థానంలో KKR కొత్త మెంటార్‌గా సంతకం చేశాడు.

DJ బ్రావో మాతో చేరడం చాలా ఉత్తేజకరమైన పరిణామం. అతను ఎక్కడ ఆడినా గెలవాలనే అతని ప్రగాఢ కోరిక, అతని విస్తృతమైన అనుభవం మా ఫ్రాంచైజీకి, ఆటగాళ్లందరికీ ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయని కేకేఆర్ తెలిపింది. CPL, MLC, ILT20 ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఫ్రాంచైజీలన్నింటితో బ్రేవో భాగమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉందని KKR CEO వెంకీ మైసూర్ తెలిపారు. వెస్టిండీస్ గ్రేట్ బ్రేవో 2021లో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ అయ్యి, ఐపీఎల్‌కు దూరమయ్యాడు.

Tags:    

Similar News