Vinesh Phogat : వినేష్‌కు వ్య‌తిరేకంగా CAS నిర్ణ‌యం.. ఇప్పటికీ మ‌రో కోర్టులో సవాలు చేయోచ్చు..!

కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)లో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ అప్పీల్ తిరస్కరించబడింది.

Update: 2024-08-15 02:23 GMT

కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (CAS)లో మహిళా రెజ్లర్ వినేష్ ఫోగాట్ అప్పీల్ తిరస్కరించబడింది. అయితే వినేష్‌ ఇంకా పతకం గెలిచే అవకాశం ఉందా అనే చర్చ తీవ్రమైంది. ఆమె ఈ నిర్ణయాన్ని సవాలు చేయగలరా? అనే ప్ర‌శ్న త‌లెత్తుతుంది. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ (UWW)కి అనుకూలంగా కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ బుధవారం తీర్పునిచ్చింది. అయితే తీర్పులో వినేష్ తలుపులు పూర్తిగా మూసుకుపోయాయని దీని అర్థం కాదు. నిబంధనల ప్రకారం.. వినేష్ ఈ నిర్ణయాన్ని స్విస్ కోర్టులో సవాలు చేయవచ్చు.

CAS వెబ్‌సైట్ ప్రకారం.. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ ఏ నిర్ణయాన్నైనా సవాలు చేయవచ్చు, కానీ చాలా పరిమిత ప్రాతిపదికన ఉంటుంది. వినేష్ విజ్ఞప్తిని తిరస్కరించిన తర్వాత భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష అధికారిక ప్రకటనలో.. అసోసియేషన్ న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తుందని తెలిపారు. స్విస్ ఫెడరల్ ట్రిబ్యునల్స్‌లో న్యాయపరమైన సహాయం చాలా పరిమిత కారణాలపై అనుమతించబడుతుంది, అంటే అధికార పరిధి లేకపోవడం, ప్రాథమిక విధానపరమైన నియమాల ఉల్లంఘన లేదా పబ్లిక్ పాలసీకి విరుద్ధంగా ఉన్నట్లైతే CAS నిర్ణయాన్ని స‌వాలు చేయ‌వ‌చ్చ‌ని తన వెబ్‌సైట్‌లో రాసింది.

మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ ఈవెంట్ ఫైన‌ల్‌కు ముందు 100 గ్రాములు ఎక్కువగా ఉండ‌టంతో వినేష్‌పై అన‌ర్హ‌త వేటు ప‌డింది. దీంతో వినేష్‌ గత బుధవారం కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్‌లో అప్పీల్ చేసింది. క్యూబా రెజ్లర్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో కలిసి ఆమెకు ఉమ్మడి రజత పతకాన్ని ప్రదానం చేయాలని డిమాండ్ చేసింది. లోపెజ్ సెమీ-ఫైనల్స్‌లో వినేష్ చేతిలో ఓడిపోయింది.. కానీ తర్వాత భారత రెజ్లర్ అనర్హతతో ఫైనల్‌లో చోటు దక్కించుకుంది. దీనిపై వినేష్ అప్పీల్ చేసి తనకు ఆమెతో కలిపి రజత పతకం ఇవ్వాలని కోరింది. భారతీయ ప్రముఖ న్యాయవాదులు హరీష్ సాల్వే, విదుష్పత్ సింఘానియా వినేష్‌కు సహాయం చేశారు. వినేష్ న్యాయవాద బృందంలో ఫ్రెంచ్ న్యాయవాదులు జోయెల్ మోన్లూయిస్, ఎస్టేల్ ఇవనోవా, హబిన్ ఎస్టేల్ కిమ్, చార్లెస్ అమ్సన్ ఉన్నారు, వీరు వినేష్, IOA వారి అప్పీల్‌ను దాఖలు చేయడంలో సహకరించారు.

Tags:    

Similar News