2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ప్రకటన
By : ehatv
Update: 2025-01-18 09:35 GMT
2025 ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును శనివారం ప్రకటించారు. భారత జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. దీనిలో 15 మంది సభ్యుల భారత జట్టును ప్రకటించారు. ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభమై, చివరి మ్యాచ్ మార్చి 9న జరుగుతుంది. చాలా మ్యాచ్‌లు పాకిస్తాన్‌లో జరుగుతాయి. కానీ టీమ్ ఇండియా మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్‌లో జరుగుతాయి. భారత జట్టు రోహిత్ శర్మ (కెప్టెన్), కోహ్లీ, శుభ్‌మన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్‌సింగ్, బూమ్రా, షమీ, అర్షదీప్, జైశ్వాల్, పంత్, జడేజాతో కూడిన జట్టును ప్రకటించారు.