Ind vs Ban 2nd Test : రెండో రోజూ వర్షార్పణం.. మిగతా మూడు రోజులు వాతావరణం ఎలా ఉంటుందంటే..
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు వర్షం కారణంగా నిలిచిపోయింది.
కాన్పూర్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు వర్షం కారణంగా నిలిచిపోయింది. మ్యాచ్ తొలి రోజు కేవలం 35 ఓవర్లు మాత్రమే ఆడింది. రెండో రోజు ఒక్క బంతి కూడా పడకుండానే ఆట ముగిసింది. ఇలాంటి పరిస్థితుల్లో మిగిలినమూడు రోజులు వాతావరణం ఎలా ఉండబోతుందోనన్న ప్రశ్నలు అభిమానులలో ఉత్పన్నమవుతున్నాయి.
అక్యూవెదర్ నివేదిక ప్రకారం.. ఆదివారం కాన్పూర్‌లో అడపాదడపా వర్షం పడే అవకాశం ఉంది. సెప్టెంబర్ 29న నగరంలో 59 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. ఉదయం పూట వర్షం కురిసే అవకాశం ఎక్కువగా ఉంది. ఆదివారం ఉదయం కాన్పూర్‌లో 1.4 మిల్లీమీటర్ల వర్షం పడవచ్చు. 98 శాతం వరకు మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నం ఖచ్చితంగా మేఘావృతమై ఉంటుంది. కానీ వర్షం పడే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మ్యాచ్ ఆలస్యంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
4వ, 5వ రోజు ఆట జరుగుతుంది సోమవారం కాన్పూర్‌లో 3 శాతం, మంగళవారం 1 శాతం వర్షం కురిసే అవకాశం ఉంది. సోమవారం ఎండగా ఉంటుంది. అయితే తెల్లవారుజామున తేలికపాటి మేఘాలు కమ్ముకునే అవకాశం ఉంది. మరోవైపు అక్టోబరు 1న పాక్షికంగా మేఘావృతమై ఉండొచ్చు, కానీ వర్షాలు ఎక్కువగా కురిసే అవకాశం లేదు. 41 శాతం వరకు క్లౌడ్ కవర్ ఉండవచ్చు.
ఇక రెండో టెస్టులో రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 35 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసింది. తొలిరోజు నుంచే వర్షం కారణంగా మ్యాచ్‌పై ప్రభావం పడింది. ఓపెనర్ జకీర్ హసన్ 24 బంతులు ఎదుర్కొని ఖాతా తెరవలేకపోయాడు. షాద్మన్ ఇస్లాం 24 పరుగులు, కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ శాంటో 31 పరుగులు చేశారు. మోమినుల్ హక్ 40 పరుగులతో, ముష్ఫికర్ రహీమ్ 6 పరుగులతో నాటౌట్‌గా ఉన్నారు. భారత్ తరఫున ఆకాశ్ దీప్ 2 వికెట్లు, అశ్విన్ 1 వికెట్ తీశారు.