Paris Olympics 2024: : 52 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ లో భారత్ తరపున అద్భుతం
హాకీలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతంగా రాణించడం.. గోల్‌కీపింగ్ తో శ్రీజేష్ మరోసారి మెరవడంతో ఆస్ట్రేలియాను ఒలింపిక్స్ లీగ్ మ్యాచ్ లో భారతజట్టు భారత్ 3-2తో ఓడించింది
హాకీలో భారత్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ అద్భుతంగా రాణించడం.. గోల్‌కీపింగ్ తో శ్రీజేష్ మరోసారి మెరవడంతో ఆస్ట్రేలియాను ఒలింపిక్స్ లీగ్ మ్యాచ్ లో భారతజట్టు భారత్ 3-2తో ఓడించింది. ఆగస్టు 2, శుక్రవారం నాడు క్వార్టర్‌ఫైనల్‌లో భారత్ ఆడనుంది. ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై విజయం కోసం 52 ఏళ్ల నిరీక్షణకు భారత్ ఈ మ్యాచ్ తో తెరదించింది. 12వ నిమిషంలో అభిషేక్ భారత్‌కు ఆధిక్యాన్ని అందించగా.. శ్రీజేష్ ఆస్ట్రేలియా దాడులను సమర్థవంతంగా అడ్డుకున్నాడు. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ మరో గోల్ చేసి ఆధిక్యాన్ని రెట్టింపు చేశాడు.
ఈ సంవత్సరం భారతదేశం- ఆస్ట్రేలియా మధ్య 8 మ్యాచ్ లు జరగగా.. ఆసీస్ మునుపటి 7 మ్యాచ్ లను గెలుచుకుంది. బెల్జియంతో జరిగిన ఓటమి నుంచి భారత్ కోలుకోవడమే కాకుండా.. ఆసీస్ లాంటి పెద్ద టీమ్ పై విజయం సాధించి క్వార్టర్స్ లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ ఆద్యంతం భారత జట్టు దూకుడుగానే ఆడింది. ఆఖర్లో ఆసీస్ స్కోరు సమం చేయడానికి ప్రయత్నించినప్పటికీ భారత్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. పూల్ బి లో భారత్ తో పాటూ బెల్జియం, ఆస్ట్రేలియా, అర్జెంటీనా క్వార్ట్రర్స్ కు క్వాలిఫై అవ్వగా.. పూల్- ఏ నుండి స్పెయిన్, నెదర్లాండ్స్, గ్రేట్ బ్రిటన్, జర్మనీ క్వాలిఫై అయ్యాయి.