Rahul Dravid : నా కోచింగ్‌ కెరీర్‌లో అదే చెత్త క్ష‌ణం..!

రాహుల్ ద్రవిడ్ రెండున్నరేళ్ల పాటు భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఉన్నాడు. T20 ప్రపంచ కప్-2024 విజయం తర్వాత ఆయ‌న‌ ఈ పదవి నుంచి త‌ప్పుకున్నాడు

Update: 2024-08-10 15:39 GMT

రాహుల్ ద్రవిడ్ రెండున్నరేళ్ల పాటు భారత క్రికెట్ జట్టు కోచ్‌గా ఉన్నాడు. T20 ప్రపంచ కప్-2024 విజయం తర్వాత ఆయ‌న‌ ఈ పదవి నుంచి త‌ప్పుకున్నాడు. అయితే కోచ్‌గా టీమ్ ఇండియాతో తాను సాధించలేకపోయిన ఒక విషయంపై ద్రవిడ్ పశ్చాత్తాపపడ్డాడు. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవకపోవడం బ్యాడ్ మూమెంట్ అని ద్రవిడ్ అన్నాడు.

రాహుల్ ద్రవిడ్ నవంబర్-2021లో టీమిండియా కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు. జనవరి 2022లో దక్షిణాఫ్రికా పర్యటనలో కోచ్‌గా మొదటి అసైన్‌మెంట్ విదేశాల్లో ఉంది. పర్యటన ప్రారంభంలో సెంచూరియన్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ అద్భుత విజయం సాధించింది. దీని తర్వాత టీమిండియా వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఓడి సిరీస్‌ను చేజార్చుకుంది. అదే తన కోచింగ్‌ కెరీర్‌లో ఇది ఓ చెత్త క్షణంగా పేర్కొన్నాడు. స్టార్ స్పోర్ట్స్‌తో ద్రావిడ్ మాట్లాడుతూ.. “మీరు నన్ను చెత్త క్షణం గురించి అడిగితే.. నా కెరీర్ ప్రారంభంలో మేము దక్షిణాఫ్రికాలో చేసిన పర్యటన నా కోచింగ్ కెరీర్‌లో చెత్త క్షణం. తొలి టెస్టు మ్యాచ్‌లో గెలిచాం. ఆ తర్వాత రెండు, మూడో టెస్టుల్లో ఓడిపోయాం. దక్షిణాఫ్రికాలో మేం ఎప్పుడూ టెస్టు సిరీస్‌ గెలవలేదు. ఈ సిరీస్‌లో విజయం సాధించడం మాకు పెద్ద అవకాశం. మా సీనియర్ ఆటగాళ్లు కొందరు ఆ పర్యటనలో మాతో లేరు. ఈ పర్యటనలో జట్టు ప్రధాన బ్యాట్స్‌మెన్‌లలో ఒకరైన రోహిత్ శర్మ గాయం కారణంగా దక్షిణాఫ్రికాకు వెళ్లలేదు. తొలి టెస్టు మ్యాచ్ తర్వాత విరాట్ కోహ్లి కూడా స్లో ఓవర్ రేట్ కారణంగా నిషేధానికి గురయ్యాడు. కానీ మేము సిరీస్ గెలవడానికి చాలా దగ్గరగా వ‌చ్చాం. కాని.. దక్షిణాఫ్రికా మా కంటే మెరుగ్గా ఆడి గెలిచిందని ద్రవిడ్ చెప్పాడు.

Tags:    

Similar News