Dinesh Karthik : రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్సీకి పోటీప‌డేది ఆ ఇద్ద‌రు ఆట‌గాళ్లే..

రోహిత్ శర్మ తర్వాత జట్టుకు కెప్టెన్సీ ఇవ్వగల ఇద్దరు భారత ఆటగాళ్ల పేర్లను భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ వెల్లడించాడు.

Update: 2024-09-10 04:01 GMT

రోహిత్ శర్మ తర్వాత జట్టుకు కెప్టెన్సీ ఇవ్వగల ఇద్దరు భారత ఆటగాళ్ల పేర్లను భారత మాజీ వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ దినేష్ కార్తీక్ వెల్లడించాడు. యువ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్‌ల పేర్లను పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్ తర్వాత ఈ ఇద్దరికి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) టీమ్ ఇండియా కెప్టెన్సీ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాడు.

ఐపీఎల్‌లో గిల్, పంత్ గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌లకు కెప్టెన్లుగా ఉన్నారు. ఇది కాకుండా వీరు ప‌లు సంద‌ర్భాల‌లో కెప్టెన్లుగా వ్య‌వ‌హ‌రించి టీమిండియాను నడిపించారు. వీరిద్దరికీ కెప్టెన్సీ అనుభవం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ తర్వాత వీరిద్దరూ కెప్టెన్సీకి పోటీదారులుగా ఉన్నారు.

కార్తీక్ మాట్లాడుతూ.. ఇద్దరు ఆటగాళ్లు టీమిండియాకు అన్ని ఫార్మాట్‌లకు తదుపరి కాబోయే కెప్టెన్‌లుగా నా మదిలోకి వస్తారు. సత్తా ఉన్నవారు సమీప భవిష్యత్తులో టీమిండియాను అన్ని ఫార్మాట్లలో నాయ‌క‌త్వం వ‌హించ‌గ‌ల‌రు. ఒకరు రిషబ్ పంత్, మరొకరు శుభమాన్ గిల్. వీరిద్దరూ IPL జట్ల కెప్టెన్లు, టీమిండియాకు కెప్టెన్‌లుగా కూడా ఉన్నారు. కాలక్రమేణా వీరు భారత్‌కు అన్ని ఫార్మాట్ల కెప్టెన్‌లుగా మారే అవకాశం ఉందని నేను భావిస్తున్నానని అన్నాడు.

T20 ప్రపంచ కప్ టైటిల్ గెలిచాక‌ హిట్‌మ్యాన్ రోహిత్‌ T20 ఫార్మాట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. వన్డేలు, టెస్టుల్లో కొనసాగుతానని చెప్పాడు. దీంతో ఇటీవల శ్రీలంక పర్యటనలో సూర్యకుమార్ యాదవ్ టీ20 అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రించాడు. జింబాబ్వే పర్యటనలో గిల్ జట్టుకు నాయకత్వం వహించాడు.  

Tags:    

Similar News