Cricket : షాకింగ్.. టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగనున్న స్టార్‌ ప్లేయ‌ర్‌..!

అక్టోబర్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ టీ20 కెప్టెన్సీ నుంచి సోఫీ డివైన్ వైదొలగనుంది

Update: 2024-08-30 02:01 GMT

అక్టోబర్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ టీ20 కెప్టెన్సీ నుంచి సోఫీ డివైన్ వైదొలగనుంది. 34 ఏళ్ల సోఫీ ఇప్పటికీ వన్డే జట్టుకు కెప్టెన్‌గా బాధ్యత వహిస్తుంది.

డివైన్ 56 T20లలో 25-28 గెలుపు-ఓటమి రికార్డుతో న్యూజిలాండ్‌కు విజ‌య‌వంత‌మైన కెప్టెన్‌గా కొన‌సాగుతుంది. మొదట 2014-15 సీజన్‌లో స్టాండ్-ఇన్ కెప్టెన్‌గా, 2020లో అమీ సాటర్త్‌వైట్ నుండి పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్య‌త‌లు తీసుకుంది. 2006లో అరంగేట్రం చేసినప్పటి నుండి 135 మ్యాచ్‌లలో 3,268 పరుగులతో న్యూజిలాండ్ జ‌ట్టులో ఆల్-టైమ్ అత్యధిక స్కోరర్‌గా ఉన్న సోఫీ.. వర్క్‌లోడ్ బ్యాలెన్స్ కోసం ఆమె ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు చెప్పింది. రెండు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం లభించినందుకు నేను చాలా గర్వపడుతున్నానని.. కెప్టెన్సీతో అదనపు పనిభారం ప‌డుతుంది.. కొన్నిసార్లు సవాలుగా ఉంటుంది.. నేను ఆస్వాదించానని తెలిపింది. T20 కెప్టెన్సీ నుండి వైదొలగడం వ‌ల్ల‌ కొంచెం ఒత్తిడి దూరం అవుతుంది. కాబట్టి నేను నా పాత్రపై మరింత ఎక్కువ శక్తిని కేంద్రీకరించగలనని పేర్కొంది.

గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న సోఫీ ODI కెప్టెన్సీని ఇంకా వదులుకోలేదని.. రెండు వైట్-బాల్ ఫార్మాట్‌లలో న్యూజిలాండ్‌కు ఆడటం కొనసాగిస్తాన‌ని తన కోరికను నొక్కి చెప్పింది. వన్డే కెప్టెన్సీని వదులుకోవడానికి నేను ఇంకా సిద్ధంగా లేనని చెప్పింది. నేను ఎప్పటికీ ఉండలేను కాబట్టి.. ఒక ఫార్మాట్‌కు నాయకత్వం వహించకుండా వెరొక‌రికి అవ‌కాశం ఇవ్వ‌డం ద్వారా మంచి కెప్టెన్‌ను త‌యారుచేయ‌వ‌చ్చ‌ని అభిప్రాయం వ్య‌క్తం చేసింది. న్యూజిలాండ్ క్రికెట్ ఇంకా టీ20 మ‌రో కెప్టెన్‌ను ప్రకటించలేదు.

Tags:    

Similar News