Rohit Sharma Retired : భార‌త్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్‌ అందించి రిటైర్మెంట్ ప్ర‌క‌టించిన హిట్ మ్యాన్‌

భారత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.

By :  Eha Tv
Update: 2024-06-30 02:55 GMT

భారత కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు. విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తర్వాత.. రోహిత్ కూడా టీ20 అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్.. ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉండదని అన్నాడు. ఈ ట్రోఫీ, T20 ప్రపంచ కప్ గెలవాలని నేను తహతహలాడుతున్నాను. నేను గెలవాలనుకున్నాను. ఇప్పుడు అది జరిగింది. ఈసారి విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్నాడు. భారత్ తరఫున టెస్టు, వన్డే ఫార్మాట్లలో ఆడటం కొనసాగిస్తానని.. అయితే పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలుగుతున్నానని రోహిత్ చెప్పాడు.

రోహిత్ T20I కెరీర్‌ను 2007లో T20 ప్రపంచకప్ విజయంతో ప్రారంభించి.. T20 ప్రపంచకప్ విజయంతో ముగించాడు. ఈ 17 ఏళ్లలో రోహిత్ బ్యాట్స్‌మెన్‌గా ఎంతో ఎత్తుకు చేరుకున్నాడు. రోహిత్‌ 159 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 32.05 సగటుతో 4,231 పరుగులు చేశాడు. రోహిత్ టీ20 కెరీర్‌ ఐదు సెంచరీలు ఉన్నాయి. ఇవి ఈ ఫార్మాట్‌లో భారతీయ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక సెంచరీలు కావ‌డం విశేషం. అలాగే 32 అర్ధ సెంచరీలు కూడా ఉన్నాయి. రోహిత్‌ ఐపీఎల్‌లో ఆడుతూ.. వన్డే-టెస్టుల్లో టీమిండియాకు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.

రోహిత్ మాట్లాడుతూ.. ఇదే నా చివరి మ్యాచ్ కూడా. నేను ఈ ఫార్మాట్‌ని ఆడటం మొదలుపెట్టినప్పటి నుంచి ఆస్వాదిస్తున్నాను. అందులోని ప్రతి క్షణాన్ని నేను ఇష్టపడ్డాను. నేను కోరుకున్నది ఇదే. నేను కప్ గెలవాలనుకున్నానని పూర్కొన్నాడు.

37 ఏళ్ల రోహిత్ 2022 T20 ప్రపంచ కప్‌లో కూడా భారతదేశానికి నాయకత్వం వహించాడు, అప్పుడు జట్టు సెమీ-ఫైనల్స్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. ఒక సంవత్సరం తరువాత రోహిత్‌ నాయకత్వంలోనే భారత్‌ స్వదేశంలో జరిగిన 50 ఓవర్ల ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకుంది, అయితే అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది.

టీ20 ప్రపంచకప్‌ల‌లో అత్యధిక పరుగులు చేసిన వారిలోవిరాట్ నంబర్ వన్, రోహిత్ శర్మ నంబర్ టూ స్థానంలో ఉన్నారు. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ 35 మ్యాచ్‌ల్లో 58.72 సగటుతో 128.81 స్ట్రైక్ రేట్‌తో 1,292 పరుగులు చేశాడు. రోహిత్ 47 మ్యాచ్‌లలో 34.85 సగటు, 133.04 స్ట్రైక్ రేట్‌తో 1,220 పరుగులు చేశాడు. వీటిలో 12 అర్ధ సెంచరీలు ఉన్నాయి. 92 పరుగులు అతని అత్యుత్తమ ఇన్నింగ్స్. టీ20 ప్రపంచకప్‌లో విరాట్ 111 ఫోర్లు, 35 సిక్సర్లు బాదగా.. రోహిత్ 115 ఫోర్లు, 50 సిక్సర్లు బాదాడు. 2007 నుంచి ప్రతి టీ20 ప్రపంచకప్‌ ఆడిన ఏకైక భారత ఆటగాడు రోహిత్ కావ‌డం విశేషం.

Tags:    

Similar News