AFG vs BAN : టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరి చ‌రిత్ర సృష్టించిన ఆఫ్ఘనిస్థాన్

టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ చ‌రిత్ర సృష్టించింది. సెయింట్ విన్సెంట్‌లోని ఆర్నోస్‌ వెల్‌ గ్రౌండ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న చివరి సూపర్‌-8 మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జ‌ట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది.

By :  Eha Tv
Update: 2024-06-25 05:25 GMT

టీ20 ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్ చ‌రిత్ర సృష్టించింది. సెయింట్ విన్సెంట్‌లోని ఆర్నోస్‌ వెల్‌ గ్రౌండ్‌లో ఆఫ్ఘనిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల మధ్య జరుగుతున్న చివరి సూపర్‌-8 మ్యాచ్‌లో ఆఫ్ఘన్ జ‌ట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెన‌ర్ గుర్భాజ్‌(43) రాణించ‌డంతో ఆఫ్ఘన్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 115 ప‌రుగులు చేసింది. అనంత‌రం బంగ్లాదేశ్ 105 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. లిట‌న్ దాస్‌(54) రాణించినా.. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు ఎనిమిది పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆఫ్ఘనిస్థాన్ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది.

బంగ్లాదేశ్‌ను ఓడించి ఆఫ్ఘనిస్థాన్ సెమీస్‌కు చేరుకుంది. దీంతో టీ20 ప్రపంచకప్‌ నుంచి ఆస్ట్రేలియా జట్టు నిష్క్రమించింది. బంగ్లాదేశ్ జట్టుపైనే ఆస్ట్రేలియా ఆశలు పెట్టుకుంది. ఈ తక్కువ స్కోరు మ్యాచ్‌లో ఒకానొక సమయంలో బంగ్లాదేశ్ అర్హత సాధించడమే కాకుండా ఆఫ్ఘనిస్తాన్‌ను కూడా మట్టికరిపిస్తుందని అంతా అనుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా లాభపడి ఉండేది. అయితే ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు కీల‌క స‌మ‌యంలో వికెట్లు తీసి విజయం సాధించారు. దీంతో జూన్ 27న జరిగే తొలి సెమీస్‌లో ఆఫ్ఘనిస్థాన్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. రెండో సెమీఫైనల్‌లో ఇంగ్లండ్‌తో భారత జట్టు తలపడనుంది.

Tags:    

Similar News