హిందూ మతంలో అనేక ప్రసిద్ధ గ్రంథాలు ఉన్నాయి. వాటిలో గరుడ పురాణాన్ని(Garuda Puranam) మహాపురాణంగా పరిగణిస్తారు.

గరుడ పురాణం ప్రకారం ఒక వ్యక్తికి ఎంత సంపద ఉన్నా, అతను తన కుటుంబం ఆనందాన్ని నిర్ధారించలేకపోతే, ఆ సంపద వ్యర్థం.

హిందూమతంలో, స్త్రీలను లక్ష్మీదేవి యొక్క స్వరూపులుగా భావిస్తారు. స్త్రీలను అగౌరవపరచడం అంటే లక్ష్మిని అగౌరవపరచడమే. గరుడ పురాణం ప్రకారం స్త్రీలను(Women Protection) రక్షించకుంటే సంపద త్వరగా నాశనం అవుతుంది.పేదలకు సహాయం చేయడానికి లేదా దాన ధర్మాలకు ఉపయోగించని సంపద త్వరలో నశించిపోతుందని గరుడ పురాణం చెబుతోంది. అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగించినప్పుడు మాత్రమే డబ్బు నిజంగా విలువైనది. ఇతరుల సంపదను స్వాధీనం చేసుకోవాలని ఆలోచించేవారు లక్ష్మీ దేవి ఆగ్రహానికి గురవుతారు, జీవితంలో నిజమైన ఆనందాన్ని పొందలేరు. గరుడ పురాణం సంపదను తెలివిగా ఉపయోగించకపోతే అది నిరర్థకమని నొక్కి చెబుతుంది. సంపదను సంరక్షించడానికి ,పెంచడానికి, ఒకరు స్త్రీలను గౌరవించాలి.. పేదలకు సహాయం చేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ఆమె సంతోషిస్తే, సంపద పెరుగుతుంది. ఆమెకు అసంతృప్తి కలిగించే చర్యలకు పాల్పడకూడదని గరుడ పురాణం చప్తోంది.

Eha Tv

Eha Tv

Next Story