ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచ ప్రసిద్ధ మహాకుంభానికి కోట్లాది మంది ప్రజలు తరలివస్తున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రపంచ ప్రసిద్ధ మహాకుంభానికి కోట్లాది మంది ప్రజలు తరలివస్తున్నారు. సోషల్ మీడియా యుగంలో,మహాకుంభానికి సంబంధించిన అనేక విషయాలు, వ్యక్తులు మరియు ఆచారాలు ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఈ మహాకుంభమేళలో దండలు అమ్ముతున్న మోనాలిసా అనే అమ్మాయి, ఆమె అందమైన కళ్ళు ప్రజల దృష్టిని ఆకర్షించాయి. మోనాలిసాను ఎవరో వీడియో తీసి షేర్ చేయగా, అది వైరల్‌గా మారింది. అందమైన కళ్లతో ఉన్న మోనాలిసా అనే 16 ఏళ్ల అమ్మాయిని చూసేందుకు, ఆమెతో ఫోటోలు దిగేందుకు జనాలు గుమిగూడారు. ఇంతలో, ఆమె ఇంటర్వ్యూలు తీయడం మొదలు పెట్టారు. ఆమె వీడియోలు Instagram మరియు Xలో వేగంగా షేర్ చేస్తున్నారు. ఎవరో మోనాలిసాను బాలీవుడ్ నుండి సినిమాలో నటించడానికి ఆఫర్ వస్తే, ఆమె చేయాలనుకుంటున్నారా? దీనికి మోనాలిసా బదులిస్తూ.. తప్పకుండా నటించాలనుకుంటున్నానని అన్నారు.
మోనాలిసా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన గిరిజన మహిళ. ప్రయాగ్‌రాజ్ మహాకుంభంలో రుద్రాక్ష మాలలు అమ్ముతూ కుటుంబాన్ని నడుపుతోంది. ఆమె వీడియో వైరల్ అయిన తర్వాత, మహాకుంభ్‌లో చాలా మంది వ్యక్తులు మోనాలిసాను చుట్టుముట్టారు, దీంతో ఆమె ఆందోళన చెందింది. వీడియోలు, సెల్ఫీలు, రీళ్లు తీసే వారు మోనాలిసాను ఫాలో అవుతున్నారు, దీంతో ఆమె చాలాసార్లు సాధువుల గుడారాల్లో తలదాచుకోవాల్సి వచ్చింది. ప్రేక్షకుల ఒత్తిడి పెరగడంతో ఆమె మహాకుంభమేళ నుంచి వెళ్లిపోవాలనుకుంటోంది. బయటకు రాగానే జనాలు చుట్టుముట్టడంతో ఇప్పుడు ఆమె భయపడుతోంది. తన అందాన్ని చూసి కొందరు తనను మహాకుంభ్‌కు దూరం చేస్తామని బెదిరించారని మోనాలిసా తెలిపింది.
ఆ సమయంలోనే తన భద్రతపై దృష్టి సారించాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను మోనాలిసా అభ్యర్థించారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ పేరుతో జనాలు తన చుట్టూ తిరుగుతున్నారని, దాని వల్ల తన దండలు అమ్మడం కష్టమవుతోందని, తన సంపాదన దెబ్బతింటోందని మోనాలిసా చెప్పింది. ఆమె కుటుంబం అప్పు చేసి లక్షల రూపాయల విలువైన సరుకులను ఇక్కడికి తీసుకొచ్చింది. అయితే ప్రస్తుతం సరుకులు విక్రయించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.