ఉత్తర భారతంలో(Uttar Pradesh) ఛత్ పూజను(chath puja) ఘనంగా జరుపుకుంటారు.
ఉత్తర భారతంలో(Uttar Pradesh) ఛత్ పూజను(chath puja) ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా బీహార్(bihar), జార్ఖండ్ ప్రజలకు ఇది అతి పెద్ద పండుగ. నాలుగు రోజుల పండుగలో సూర్యుడిని, ఛతీమయ్యను పూజిస్తారు. రాముడు, సీత అయోధ్య నుంచి తిరిగి వచ్చి పట్టాభిషేకం జరిగిన తర్వాత సీతా దేవి ఉపవాస దీక్ష చేసి, సూర్యనారాయణుడిని పూజించిన రోజుగా చెబుతుంటారు. ఈ పర్వదినం కార్తీక శుక్ల చతుర్ది రోజున ప్రారంభమై కార్తీక శుక్ల సప్తమి రోజున ముగుస్తుంది. ఆ సమయంలో మహిళలు ఉపవాసంతో ఉండి చివరి రోజున నదిలోకి వెళ్లి సూర్యుడికి అర్ఝ్య సమర్పిస్తారు. ఇందుకోసం కొందరు మహిళలను ఓ నదిలో(River) దిగారు. అప్పుడు జరిగిన సంఘటన చాలా మందికి ఆశ్యర్యం కలిగిస్తున్నది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఛత్ పూజ సమయంలో అర్ఘ్యను అందించడానికి నది ఒడ్డున నీటిలో కొందరు మహిళలు నిలబడి ఉన్నారు. ఆ సమయంలో ఒక పాము నీటి అడుగు నుంచి ఈదుకుంటూ అక్కడకు వచ్చింది. ఆ పామును(Snake) చూసిన చాలా మంది మహిళలు భయంతో ఒడ్డుకు వచ్చేశారు. ఒక మహిళ మాత్రం నదిలో అలాగే ఉండిపోయింది. ఆ పాము ఆమె వైపు ఈదుకుంటూ వచ్చింది. ఒడ్డున ఉన్న వారిలో టెన్షన్ మొదలయ్యింది. పాము ఏం చేస్తుందోనన్న భయం. అయితే ఆమెవైపు తల ఎత్తి చూసిన ఆ పాము ఆమెను ఏం చేయకుండా పక్కనుంచి వెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భగవంతుడిమీద ఆమెకు ఉన్న నమ్మకానికి ఇదో ఉదాహరణ అని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఆపదలో ఉన్నప్పుడు కంగారు పడకుండా నిబ్బరంగా ఎదుర్కోవాలని మరికొందరు కామెంట్ చేస్తున్నారు.