Kolkata Doctor Murder Case : మహిళా డాక్టర్ హ‌త్య‌కేసు.. నేడు సుప్రీంలో విచారణ

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్ హత్య, అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది.

Update: 2024-09-09 02:06 GMT

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో మహిళా డాక్టర్ హత్య, అత్యాచారం కేసును సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. సుప్రీంకోర్టు స్వయంగా ప్రారంభించిన ఈ వ్యాజ్యాన్ని చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 9న విచారించనుంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ తన స్టేటస్ రిపోర్టును ఇవాళ కోర్టుకు సమర్పించనుంది.

ఆస్పత్రిలో భద్రత కల్పిస్తున్న సీఐఎస్‌ఎఫ్‌కు బెంగాల్ ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపిస్తూ కేంద్రం ఇటీవల సుప్రీంకోర్టులో దరఖాస్తు చేసింది. సీఐఎస్‌ఎఫ్‌కు పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర అధికారులను ఆదేశించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తన దరఖాస్తులో కోరింది. ఆగస్టు 22న కోల్‌కతా హత్య, అత్యాచారం కేసును విచారిస్తున్నప్పుడు.. వైద్యురాలి అసహజ మరణాన్ని నమోదు చేయడంలో జాప్యం చేసినందుకు సుప్రీంకోర్టు కోల్‌కతా పోలీసులను మందలించింది.

Tags:    

Similar News