ఢిల్లీలో(Delhi) జరిగిన ఈ సంఘటన అందరినీ కలవరపరుస్తున్నది
తల్లి కెనడాకు(Canada) వెళ్లనివ్వకుండా అడ్డుకోవడమే కాకుండా, వెళ్లకుండా ఉండేందుకు మంత్రాలు వేస్తున్నదని అనుమానపడిన ఓ కొడుకు(Son) ఆమెను నిర్దాక్షణ్యంగా చంపేశాడు(Kill). ఢిల్లీలో(Delhi) జరిగిన ఈ సంఘటన అందరినీ కలవరపరుస్తున్నది. ఢిల్లీలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి బుధవారం సాయంత్రం తీవ్రగాయాలతో ఉన్న మహిళను తీసుకొచ్చారు. పరిస్థితిని చూసిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు ఫోన్ చేశారు. అక్కడికి వచ్చిన పోలీసు(Police) బృందం ప్రాథమిక సమాచారం తెలుసుకొని సంఘటన జరిగిన జైత్‌పూర్‌కు(Jaithpur) వెళ్లారు. అక్కడ దర్యాప్తు జరిపిన పోలీసులకు దిగ్భ్రాంతి కలిగించే విషయాలు తెలిశాయి. 31 ఏళ్ల క్రిషన్ కాంత్(Krishan kanth) తన తల్లిని కత్తితో పొడిచి చంపేశాడు. తర్వాత తండ్రి సూర్జిత్‌కు ఫోన్ చేసి వెంటనే ఇంటికి రావాలని చెప్పాడు. ఆయన కంగారు కంగారుగా ఇంటికి వచ్చి చూసే సరికి క్రిషన్ కాంత్ కనిపించాడు. సారీ నాన్న అంటూ వేడుకున్నాడు. మొదటి అంతస్తులోని ఇంటికి తీసుకెళ్లాడు. తండ్రి ఇంట్లోకి వెళ్లగానే బయట గొళ్లెం పెట్టి పారిపోయాడు. ఇంట్లో తన భార్య గీత రక్తం మడుగుమడుగులో ఉండటాన్ని చూసి సుర్జీత్ భయపడిపోయాడు. పక్కింటివారి సాయంతో తలుపు తీయించి ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయింది. క్రిషన్‌కాంత్‌ను పోలీసులు అరెస్టు(arrest) చేశారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన క్రిషన్‌కాంత్‌కు ఉద్యోగం, సద్యోగం ఏమీ లేవు. కెనడా వెళ్లి అక్కడ ఉద్యోగం చేయాలని అనుకున్నాడు. తల్లి మాత్రం వద్దని చెప్పింది. మంత్రాలు వేసి తన కెనడా ప్రయాణాన్ని తల్లి అడ్డుకుంటోందని అనుమానం పెంచుకున్న క్రిషన్ ఆమెను చంపేశాడు.